పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్ది బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరింది. ముఖ్యంగా నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తున్న సీఎం మమతా బెనర్జీ..  బీజేపీ నేత సువేందు అధికారిలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. 

ఈ క్రమంలో సువేందు తన ఒకప్పటి బాస్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పోలింగ్ బూత్‌లను రిగ్గింగ్ చేస్తుందంటూ మమత చేసిన ఆరోపణలకు సువేందు కౌంటరిచ్చారు. మమత రిగ్గింగ్ క్వీన్ అంటూ విరుచుకుపడ్డారు.

బెంగాల్‌లో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగడం మమతకు ఏమాత్రం ఇష్టం లేదంటూ అధికారి ఆరోపించారు. తృణమూల్ చొరబాటుదార్లను ప్రేరేపిస్తోందని, అయినా, పోలీసులు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని ఆయన విమర్శించారు.

కేంద్రంలో బీజేపీని ఓడిస్తామని మమత పదే పదే మాట్లాడుతున్నారని, 2019 ఎన్నికల సమయంలో యునైటెడ్ ఫ్రంట్ అంటూ తెగ ప్రచారం చేశారని, ఆ కూటమి ఏమైందో చెప్పాలని సుబేందు డిమాండ్ చేశారు.