Asianet News TeluguAsianet News Telugu

బెంగాల్ ఎన్నికలు: ఈసీపై ఆగ్రహం.. వీల్‌చైర్‌లోనే ధర్నాకు దిగిన దీదీ

ప‌శ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌లు వాడి వేడిగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్‌లో సాగుతున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ప్ర‌చారంలో పాల్గొంటున్న సీఎం, టీఎంసీ  అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీపై ఎన్నికల సంఘం ఓ రోజు నిషేధించిన సంగతి తెలిసిందే. 

Mamata Banerjee Holds Sit In Protest Over Election Commissions 24 Hour Ban ksp
Author
Kolkata, First Published Apr 13, 2021, 2:22 PM IST

ప‌శ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌లు వాడి వేడిగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్‌లో సాగుతున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ప్ర‌చారంలో పాల్గొంటున్న సీఎం, టీఎంసీ  అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీపై ఎన్నికల సంఘం ఓ రోజు నిషేధించిన సంగతి తెలిసిందే.

తన ప్రసంగాల్లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన అభియోగంపై ఈసీ వేటు వేసింది. బెంగాల్‌లో ముస్లింలంతా క‌లిసి తృణమూల్ కాంగ్రెస్‌ అభ్యర్థులకే ఓటేయాలని ఆమె అన‌డంతో పాటు కేంద్ర బలగాలను ఘెరావ్ చేయాల‌ని, వారిపై తిరగబడాల‌ని ప్రజలను రెచ్చగొట్టడం వంటి వ్యాఖ్య‌లు చేయ‌డాన్ని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది.

Also Read:కూచ్ బెహార్ కాల్పులు : అమిత్ షా రాజీనామాకు దీదీ డిమాండ్..

అయితే, తాను ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించానంటూ ఈసీ తీసుకున్న నిర్ణ‌యంపై ధ‌ర్నా చేస్తాన‌ని దీదీ ఇప్పటికే ప్రకటించారు. దీనిలో భాగంగా ఆమె చెప్పిన‌ట్లుగానే ధ‌ర్నాకు దిగారు.

కోల్‌కతాలోని గాంధీ విగ్రహం దగ్గర వీల్‌చైర్‌లో కూర్చొని ధర్నాలో పాల్గొంటున్నారు. మరోవైపు, బెంగాల్‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నియోజ‌క వ‌ర్గాల్లో తృణమూల్ ఇత‌ర నేత‌లు ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో య‌థావిధిగా పాల్గొంటున్నారు

Follow Us:
Download App:
  • android
  • ios