Asianet News TeluguAsianet News Telugu

కమ్ముకొస్తున్న కరోనా: ఒకే విడతలో బెంగాల్ ఎన్నికలు, ఈసీ కీలక నిర్ణయం..?

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నాలుగు విడతలు ముగిసి, మరో నాలుగు విడతలు పూర్తి కావాల్సి ఉన్న సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రంలో గడిచిన కొన్నివారాలుగా కరోనా కేసులు నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ec calls all party meeting in kolkata as covid cases surge in west bengal
Author
Kolkata, First Published Apr 14, 2021, 9:34 PM IST

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నాలుగు విడతలు ముగిసి, మరో నాలుగు విడతలు పూర్తి కావాల్సి ఉన్న సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రంలో గడిచిన కొన్నివారాలుగా కరోనా కేసులు నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పరిస్థితిని సమీక్షించి, ఎన్నికల ప్రచార నిర్వహణపై పార్టీల అభిప్రాయం తెలుసుకునేందుకు ఎన్నికల కమిషన్ శుక్రవారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాల్సిన నాలుగు విడతల (5,6,7,8) పోలింగ్‌ను ఒకేసారి నిర్వహించే అవకాశాలు ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

కాగా, పశ్చిమబెంగాల్‌లో గత 24 గంటల్లో కొత్తగా 4,817 కరోనా కేసులు నమోదవ్వగా... 20 మంది మరణించారు. రాజధాని కోల్‌కతాలో ఒక్కరోజే 1,271 కేసులు, ఉత్తర 24 పరగణాల్లో 1,134 కేసులు నమోదయ్యాయి.

Also Read:‘‘ఆక్సిజన్, వ్యాక్సిన్లు, బెడ్లు, రెమ్‌డిసివర్’’.. అన్నింటికీ కొరత, ముంచుకొస్తున్న ముప్పు

రాష్ట్రంలో ప్రస్తుత 29,050 యాక్టివ్ కేసులున్నాయి. కోల్‌కతా నుంచి తాజాగా 11 మరణాలు, ఉత్తర 24 పరగణాల నుంచి 4, హుగ్లీ, హౌరా నుంచి చెరో రెండు, పశ్చిమ బర్దమాన్ జిల్లాలో ఒక కేసు నమోదయ్యాయి.

మంగళవారం నాటికి రాష్ట్రంలో 1,13,710 మంది కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. మరోవైపు, రాష్ట్రంలో కరోనా కేసులు విజృంభిస్తుండటంతో వ్యాకినేషన్ వేసేందుకు ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించాలని బెంగాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Follow Us:
Download App:
  • android
  • ios