న్యూఢిల్లీ: టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ బావ మరిదికి శుక్రవారం నాడు సీబీఐ అధికారులు సమన్లు పంపారు. అక్రమ బొగ్గు తవ్వకాల కేసుకు సంబంధించి  టీఎంసీ ఎంపీ బంధువును ఈ ఏడాది మార్చి 15న విచారణకు పిలిచినట్టుగా సీబీఐ అధికారులు తెలిపారు.

అభిషేక్ బెనర్జీ సోదరి భర్త గంబీర్ భర్త అంకుష్ అరోరా ఈ కేసులో దర్యాప్తు అధికారి ముందు హాజరుకావాలని కోరినట్టుగా తెలిపారు.

తూర్పు కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ లోని గనుల నుండి అక్రమ బొగ్గును తవ్వారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఫైల్ ఫేరేజ్ కు సంబంధించిన కేసులో బెనర్జీ భార్య రుజీరా, మేనకా గంభీర్ భర్త అంకుర్ ఆరోరా ఆయన తండ్రి పవన్ ఆరోరాలను ఈ నెల 15న విచారణకు హాజరు కావాలని సీబీఐ ఆదేశించింది.

శారద కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సమీర్ చక్రవర్తి, ప్రముఖ ఆర్టిస్ట్ సువప్రసన్నలకు నిన్ననే ఈడీ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.

బెంగాల్ రాష్ట్రంలో మొత్తం 8 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 27న తొలి విడత ఎన్నికలు జరుగుతాయి.ఈ ఎన్నికల సమయంలో టీఎంసీకి చెందిన నేతలకు సమన్లు జారీ చేయడంపై  విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.2011, 2016 ఎన్నికల్లో బెంగాల్ రాష్ట్రంలో టీఎంసీ విజయం సాధించింది.