Asianet News TeluguAsianet News Telugu

‘‘ బెంగాల్‌లో బీజేపీదే విజయం’’.. కలకలం రేపుతున్న ప్రశాంత్ కిశోర్ ఆడియో క్లిప్

బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ-తృణమూల్ కాంగ్రెస్ మధ్య ఓ వైపు రసవత్తర పోరు జరుగుతుంటే .. మరోవైపు ఓ ఆడియో క్లిప్ వ్యవహారం కాకరేపుతోంది. తృణమూల్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీతో పాటు ఆ పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా వున్న ప్రశాంత్ కిశోర్‌ని బీజేపీ టార్గెట్ చేయడం దుమారం రేపుతోంది.

BJP shares audio clips purportedly with Prashant Kishor admitting Modis popularity ksp
Author
Kolkata, First Published Apr 10, 2021, 2:26 PM IST

బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ-తృణమూల్ కాంగ్రెస్ మధ్య ఓ వైపు రసవత్తర పోరు జరుగుతుంటే .. మరోవైపు ఓ ఆడియో క్లిప్ వ్యవహారం కాకరేపుతోంది. తృణమూల్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీతో పాటు ఆ పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా వున్న ప్రశాంత్ కిశోర్‌ని బీజేపీ టార్గెట్ చేయడం దుమారం రేపుతోంది.

బెంగాల్‌లో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనంటూ స్వయంగా ప్రశాంత్ కిశోర్ అంగీకరించారంటూ క్లబ్ హౌస్‌లో పిచ్చాపాటి ఆడియో క్లిప్‌ను రిలీజ్ చేసింది బీజేపీ.  భారతీయ జనతా పార్టీ రిలీజ్ చేసిన ఆ ఆడియో క్లిప్ వింటే మోడీపై ఓ రేంజ్ ప్రశాంత్ కిశోర్ పొగడ్తలు కురిపించినట్లుగా వుంది.

దేశంలో మోడీ ప్రభంజనం సృష్టించారని.. బెంగాల్‌లో ఆయన బహిరంగ సభలకు జనం భారీగా వస్తున్నారని ప్రశాంత్ కిశోర్ అన్నారు. కోటి మందికిపైగా హిందీ మాట్లాడేవాళ్లు, 27 శాతం దళితులు పూర్తిగా బీజేపీ వైపు వున్నారని పీకే వ్యాఖ్యానించారు.

అంతేకాకుండా సర్వేల సమయంలో ఏ ప్రభుత్వం వస్తుందంటే జనం బీజేపీయే అధికారంలోకి వస్తుందని చెప్పారని.. ప్రశాంత్ కిశోర్ స్వయంగా అంగీకరిస్తున్నట్లు ఆడియో క్లిప్ బట్టి తెలుస్తోంది. అయితే పీకే మాట్లాడిన దానిని తమకు అనుకూలంగా ఎడిట్ చేసి ఆ ఆడియో క్లిప్‌ను తయారు చేసినట్లు తెలుస్తోంది.

మరోవైపు బీజేపీ రిలీజ్ చేసిన ఆడియో క్లిప్‌పై స్పందించారు ప్రశాంత్ కిశోర్. తమ నేతల మాటల కంటే తన చాట్‌ను బీజేపీ సీరియస్‌గా తీసుకున్నందుకు ఆనందంగా వుందంటూ చురకలు అంటించారు. అయితే  తన ఛాట్‌లోని ముక్కలపై ఆసక్తి కనబరచడం కంటే మొత్తం ఛాట్‌ను షేర్ చేసే ధైర్యం చూపించి వుంటే బావుండేదని పీకే అన్నారు.

తాను ముందే చెప్పాను.. ఇప్పుడు కూడా అదే చెబుతున్నానను. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ వంద సీట్లకు మించి గెలిచే అవకాశం లేదంటూ ట్వీట్ చేశారు పీకే. గతేడాది డిసెంబర్ 21న బీజేపీ డబుల్ డిజిట్ దాటదని కొన్ని మీడియా సంస్ధలు ఆ పార్టీకి హైప్ క్రియేట్ చేస్తున్నాయంటూ ట్వీట్ చేశారు ప్రశాంత్ కిశోర్. అంతేకాదు తన ట్వీట్‌ను సేవ్ చేసుకోవాలని.. ఒకవేళ బీజేపీ వంద సీట్లు దాటితే ఏకంగా తన వృత్తికే గుడ్‌బై చెబుతానన్నారు

Follow Us:
Download App:
  • android
  • ios