పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ మరో అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. 5, 6, 7, 8 విడతల్లో పోటీ చేయబోయే 148 మంది అభ్యర్థుల జాబితాను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌ గురువారం విడుదల చేశారు. 

ఈ జాబితాలో పార్టీ ఉపాధ్యక్షుడు ముకుల్‌ రాయ్‌, రాహుల్‌ సిన్హా, అసిమ్‌ సర్కార్‌ పేర్లు ఉన్నాయి. గతంలో తృణమూల్‌ కాంగ్రెస్‌లో కీలక నేతగా వ్యవహరించడంతో పాటు కేంద్ర రైల్వేశాఖ మంత్రిగా పనిచేసిన ముకుల్‌ రాయ్‌ ఈ ఎన్నికల్లో కృష్ణా నగర్‌ నార్త్ స్థానం నుంచి పోటీ చేయనున్నారు.

ఇప్పటికే తొలి నాలుగు విడతల ఎన్నికలకు అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. తాజాగా మిగిలిన విడతలకు పోటీచేయబోయే అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. ఇంకా 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. 8 దశల్లో పశ్చిమ బెంగాల్‌ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. మే 2 న ఓట్ల లెక్కింపు జరగనుంది.