Asianet News TeluguAsianet News Telugu

పశ్చిమబెంగాల్: నందిగ్రామ్‌లో మమతపై సువేందు లీడ్

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అత్యంత కీలకమైన నందిగ్రామ్ అసెంబ్లీ స్థానంలో  సీఎం మమత బెనర్జీపై  ఆమె సమీప ప్రత్యర్ధి సువేందు అధికారి అధిక్యంలో నిలిచారు. 
 

BJP leader suvendu leaders on mamata banerjee in nandigram assembly segment lns
Author
West Bengal, First Published May 2, 2021, 9:15 AM IST

కోల్‌కత్తా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అత్యంత కీలకమైన నందిగ్రామ్ అసెంబ్లీ స్థానంలో  సీఎం మమత బెనర్జీపై  ఆమె సమీప ప్రత్యర్ధి సువేందు అధికారి అధిక్యంలో నిలిచారు. తొలి రౌండ్లలో కూడ సువేంధు అధికారి సీఎం మమత బెనర్జీపై ఆధిక్యంలో నిలిచారు. ఆ తర్వాత సువేంధు అధికారిని వెనక్కి నెట్టి మమత బెనర్జీ ఆధిక్యంలోకి వచ్చారు. కరోనా వైరస్ దేశంలో విస్తృతంగా వ్యాపిస్తున్న తరుణంలోనే పశ్చిమ బెంగాల్ ఎన్నికలు జరిగాయి. 27 మర్చి నుంచి 29 ఏప్రిల్ వరకు 8 విడతల్లో ఎన్నికలు జరిగాయి. జంగిపూర్, షంషేర్ గంజ్ అభ్యర్థుల ఆకస్మిక మరణం కారణంగా ఎన్నికల సంఘం ఈ రెండు స్థానాల ఎన్నికలను వాయిదా వేసింది. అక్కడ ఉపఎన్నిక మే 16వ తేదీన జరగనున్నాయి. 

మొత్తం 294 సీట్లున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో 148 మేజిక్ ఫిగర్. ఎలాగైనా ఈసారి బెంగాల్ లో కాషాయ జెండా రెపరెపలాడించాలని బలంగా భావించిన బీజేపీ, మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని నిలుపుకొని హాట్ ట్రిక్ కొట్టాలని మాత బెనర్జీ, అస్థిత్వాన్ని నిలుపుకోవడానికి కాంగ్రెస్- లెఫ్ట్ కూటమి బరిలో నిలిచాయి. శాయశక్తులా ఎన్నికలో విజయం సాధించేందుకు తుదికంటా పోరాడాయి. 

ఇక ఈ ఎన్నికల్లో హిందుత్వ అస్త్రాన్ని, పరివర్తన నినాదాన్ని భుజానికెత్తుకొని బీజేపీ ప్రచారం చేసింది. ప్రధాని నరేంద్రమోడీ, హోమ్ మంత్రి అమిత్ షా పూర్తిగా బెంగాల్ ఎన్నికల మీద దృష్టిసారించి నెల రోజుల్లో దాదాపుగా తమ పర్యటనలను ప్లాన్ చేసుకొని ప్రచారం నిర్వహించారు. మరోపక్క మమతా బెనర్జీ బెంగాలీ అస్థిత్వాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. బెంగాలీలు కాని అమిత్ షా, మోడీ లు వచ్చి బెంగాల్ అస్థిత్వాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని, బెంగాలీలు తమ అస్థిత్వాన్ని కాపాడుకోవాలంటే బీజేపీకి ఓటు వేయకూడదని బలంగా ప్రచారం నిర్వహించారు. 


ఇక ఈ ఎన్నికల పర్వం మొత్తం మాత బెనర్జీ వీల్ చైర్ లో కూర్చొనే ప్రచారం చేశారుజ. హై వోల్టేజి ఎన్నికల యుద్ధం ఇక్కడ వ్యక్తిగత దాడుల వరకు వెళ్ళింది. బములు విసురుకోవడం, తుపాకీ కాల్పులు అన్ని వెరసి ఎన్నికల వాతావరణం ఒకింత హింసాత్మకంగా మారింది. ఇక ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మాత బెనర్జీ కోసం ఈ ఎన్నికల్లో పనిచేసారు.

Follow Us:
Download App:
  • android
  • ios