తొలి విడత పోలింగ్‌కు ఒక్కరోజు ముందు బెంగాల్‌లో పేలుడు కలకలం సృష్టించింది. బంకురా జిల్లా జోయ్‌పురాలో టీఎంసీ కార్యాలయంలో ఈ పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి

తొలి విడత పోలింగ్‌కు ఒక్కరోజు ముందు బెంగాల్‌లో పేలుడు కలకలం సృష్టించింది. బంకురా జిల్లా జోయ్‌పురాలో టీఎంసీ కార్యాలయంలో ఈ పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ పేలుడుతో జోయ్‌పూర్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తృణమూల్, ఐఎస్ఎఫ్ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగాయి.

దీంతో ముందు జాగ్రత్త చర్యగా భారీగా పోలీసులు మోహరించారు. పేలుడుకు కాంగ్రెస్-లెఫ్ట్ కూటమే కారణమని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. అయితే టీఎంసీ నేతలే డ్రామాలాడుతున్నారని బీజేపీ నేతలు కౌంటరిచ్చారు. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు బాంబులు చుడుతుండగా పేలుడు జరిగిందని ఆరోపిస్తున్నారు. 

బెంగాల్‌లో ఐదు జిల్లాల్లో 30 శాసన సభ స్థానాలకు తొలి దశలో రేపు పోలింగ్‌ జరగనుంది.. పశ్చిమ మిడ్నాపూర్, తూర్పు మిడ్నాపూర్, బంకురా, జార్‌గ్రామ్‌, పురులియా జిల్లాల్లో ఫస్ట్‌ ఫేస్ పోలింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆఖరి నిమిషం వరకు ఓటర్లను ఆకట్టుకునేందుకు విశ్వప్రయత్నం చేశారు బీజేపీ, టీఎంసీ నేతలు.. బీజేపీ తరఫున ప్రధాని మోడీ సహా అతిరథ మహారథులు ప్రచారం నిర్వహించారు. మరోవైపు మమత బెనర్జీ కూడా ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు.

ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న 30 నియోజకవర్గాల్లో 2016లో టీఎంసీ భారీగా సీట్లు కైవసం చేసుకుంది. 30 సీట్లలో మొత్తం 27 టీఎంసీ గెలుచుకోగా… కాంగ్రెస్ రెండు సీట్లు, ఆర్‌ఎస్పీ ఒక స్థానంలో గెలుపొందింది