సీఎం కేసీఆర్ కులంలోనే బలుపు... టీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు
వివాదాస్పద టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఈసారి ఏకంగా సీఎం కేసీఆర్ కులంతోనే పెట్టుకున్నాడు. వెలమ కులాన్ని ఉద్దేశిస్తూ ఆయన ఓ బహిరంగ సభలోనే అనుచిత వ్యాఖ్యలు చేశారు.
మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. అయితే ఈసారి ఆయన ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కులంతోనే పెట్టుకున్నాడు. కేసీఆర్ కులంపై ఏకంగా ఓ బహిరంగ సభలోనే అనుచితంగా మాట్లాడుతూ వివాదానికి తెరతీశాడు.
తెలంగాణ లో నిమ్న కులాలు ఇంకా వివక్షకు గురవుతున్నారని మాట్లాడుతూ ఉన్నత కులాల పేర్లను శంకర్ నాయక్ ప్రస్తావించారు. వెలమ, రెడ్డి సామాజిక వర్గాల వారిలో చాలా గర్వం వుంటుందని... నిమ్న కులాను గౌరవించే మనస్తత్వం వీరిలో వుండదంటూ వ్యాఖ్యానించారు.
సోమవారం కేసముద్రంలో జరిగిన క్రిస్మస్ దుస్తుల పంపిణీ కార్యక్రమంలో శంకర్ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన బలహీన వర్గాల ఆత్మగౌరవంపై ప్రసంగించారు. ఈ సందర్భంగా మనుషులకు మూడింటి వల్ల గర్వం వస్తుందని... అవేమిటో వివరించే ప్రయత్నం చేశారు.
read more వెయిట్ లిప్టర్ అవతారమెత్తిన తెలంగాణ మంత్రి
మొదట అధిక కులంలో పుట్టడం వల్ల చిన్నప్పటినుండే గర్వం తలకెక్కుతుందన్నారు. ముఖ్యంగా వెలమ, రెడ్డి కులాలవారు చిన్న కులాలవారిని కించపర్చేలా వ్యవహరిస్తుంటారని...వారికి కులం బలుపు ఎక్కువగా వుంటుందంటూ వ్యాఖ్యానించారు.
ఇక ధనం ఎక్కువగా వుండేవాళ్లకు కూడా బలుపు వుంటుందన్నారు. పేదలను, సామాన్యులను కించపర్చులా వారు ప్రవర్తిస్తుంటారని అన్నారు. మూడోది అదిక విద్యావంతులయితే వారిలో బలుపు వుటుందన్నారు. బాగా చదివేవారు చదువుకోలేని పేదలను, చదువు అబ్బని వారిపట్ల చులకభావాన్ని కలిగివుంటారని... దీంతో తెలియకుండానే వారిలో బలుపు పెరిగిపోతుందంటూ వ్యాఖ్యానించారు.
read more జార్ఖండ్ లో కాంగ్రెస్ కూటమి విజయం... తెలంగాణ నాయకుడి హస్తం