Asianet News TeluguAsianet News Telugu

వెయిట్ లిప్టర్ అవతారమెత్తిన తెలంగాణ మంత్రి

సికింద్రాబాద్ జింఖానా స్డేడియంలో తెలంగాణ వెయిట్ లిప్టింగ్ ఛాంపియన్ షిప్ ఫోటీలను క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్  ప్రారంభించారు.  

minister srinivas goudinaugurates telangana state weight lifting chmpionship
Author
Hyderabad, First Published Dec 23, 2019, 8:47 PM IST

తెలంగాణ స్టేట్ వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ జింఖాన మైదానంలో తెలంగాణ స్టేట్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ 6 ఫోటీలు ప్రారంభమయ్యాయి.  సీనియర్ పురుషుల మరియు మహిళల విభాగంలో జరుగుతున్నఈ పోటీలను రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి  శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు.

minister srinivas goudinaugurates telangana state weight lifting chmpionship
 
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో క్రీడలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రోత్సహం అందిస్తున్నారన్నారు. రాష్ట్రంలో క్రీడాకారులకు ఉద్యోగ అవకాశాల కోసం 2 శాతం, ఉన్నత విద్య కోసం 0.5 శాతం క్రీడా రిజర్వేషన్లు అందిస్తున్నామన్నారు.  

read more  జార్ఖండ్ లో కాంగ్రెస్ కూటమి విజయం... తెలంగాణ నాయకుడి హస్తం

రాష్ట్రంలో క్రీడా మౌళిక వసతుల కల్పన కు కృషిచేస్తున్నామన్నారు. హైదరాబాద్ నగరం క్రీడా హబ్ గా రూపొందుతుందన్నారు. 2020 - టోక్యో లో జరిగే ఒలింపిక్స్ లో తెలంగాణ  క్రీడాకారులు మంచి ప్రతిభను కనబరచి దేశానికి, రాష్ట్రానికి మంచి పేరు ప్రఖ్యాతులు తేవాలని మంత్రి ఆకాంక్షించారు. 

minister srinivas goudinaugurates telangana state weight lifting chmpionship

ఈ వెయిట్ లిఫ్టింగ్ పోటీలను నేటి నుండి ఈ నెల 25 వరకు జరుగుతాయన్నారు. ఎక్కడ ప్రతిభ సాధించిన వెయిట్ లిఫ్టర్లు నేషనల్ కి ఎంపిక అవుతారని మంత్రి వెల్లడించారు.  ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్పోర్ట్స్ చైర్మన్  అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి, రాష్ట్ర వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు సాయిలు, కార్యవర్గ సభ్యులు, డివైఎస్‌వో సుధాకర్ లు పాల్గొన్నారు.

read more  జార్జిరెడ్డికి ఛాలెంజ్ విసిరిన సింగర్ మంగ్లీ


 

Follow Us:
Download App:
  • android
  • ios