జార్ఖండ్ లో కాంగ్రెస్ కూటమి విజయం... తెలంగాణ నాయకుడి హస్తం

జార్షండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూటమి ఘన విజయం సాధించి అధికారాన్ని చేజిక్కించుకునే దిశగా అడుగులు వేసింది. ఈ విజయం వెనుక తెలంగాణకు చెందిన ఓ నాయకుడి హస్తం కూడా వుంది. 

jharkhand results: celebrations at telangana congress office

జార్ఖండ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ  ఆధ్వర్యంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. సోమవారం వెలువడిన ఫలితాల్లో ఈ కూటమి విజయం దాదాపు ఖరారయ్యింది. అయితే ఈ విజయం వెనుక తెలంగాణకు చెందిన ఓ కాంగ్రెస్ హస్తముంది. దీంతో ఫలితం కాంగ్రెస్ కూటమికి అనుకూలంగా రావడంతో గాంధీ భవన్ లో సంబరాలు మిన్నంటాయి. 

ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ జార్ఖండ్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పరిశీలకునిగా పనిచేశారు. దీంతో ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత  భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయనను కలుసుకుని అభినందించారు.

jharkhand results: celebrations at telangana congress office

 కాంగ్రెస్ కార్యాలయానికి చేరుకున్న సంపత్ కు మిగతా కాంగ్రెస్ నాయకులు కూడా అభినందించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు స్వీట్లు పంచుకున్నారు. అనంతరం గాంధీభవన్ బయటకు వచ్చిన నాయకలు కాంగ్రెస్ కు అనుకూలంగా నినాదాలు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు.  

jharkhand results: తండ్రి ఆశీర్వాదం...సైకిల్ పై చక్కర్లు: చిన్నపిల్లాడైపోయిన హేమంత్ సొరేన్

జార్ఖండ్ రాష్ట్రం లో బీజేపీ కి పరాజయం తప్పేలా కనపడడం లేదు. ఇప్పటికే కాంగ్రెస్ కూటమి కంటే చాలా వెనుకబడిన బీజేపీ కి గట్టి షాక్ తగలడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తం 81సీట్లు ఉన్న జార్ఖండ్ అసెంబ్లీలో కాంగ్రెస్-జేఎంఎం-ఆర్జేడీ కూటమి దాదాపుగా 48 సీట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ కేవలం 24 సీట్లలోనే ఆధిక్యతలో ఉంది.

jharkhand results: celebrations at telangana congress office

ఇదిలా ఉండగా జార్ఖండ్ ముఖ్యమంత్రి బీజేపీ రథసారథి అయిన రఘుబర్ దాస్ కూడా ఓటమి అంచున ఉన్నాడు. ఇది బీజేపీ కి మరింత షాకింగ్ మారింది. జంషెడ్ పూర్ తూర్పులో పోటీచేసిన బీజేపీ అభ్యర్థి రఘుబర్ దాస్ పై స్వతంత్ర అభ్యర్థి సరయూ రాయ్ ముందజంలో కొనసాగుతుండడం విశేషం. 

jharkhand results: celebrations at telangana congress office

ఝార్ఖండ్ కాబోయే ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ తన తండ్రిని కలిసాడు. తండ్రి శిబూ సొరేన్ ను కలిసి ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఆ తరువాత అక్కడ సైకిల్ తొక్కుతూ చిన్నపిల్లాడిలా ఆ ఇల్లంతా చక్కర్లు కొట్టాడు.  

సీఎంల ఓటమి చరిత్ర మరోసారి రిపీట్.... ఓటమి అంచున రఘుబర్ దాస్

ఝార్ఖండ్  రాష్ట్ర ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించిన, రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన షిబు సోరెన్ కుమారుడు హేమంత్ సోరెన్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో రాజకీయాల్లోకి ప్రవేశించారు. 

2009 నుండి 2013 వరకు బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వానికి పార్టీ మద్దతు ఇచ్చినప్పుడు ఆయన ముఖ్యమంత్రి అర్జున్ ముండాకు డిప్యూటీగా ఉన్నారు. 2013 జనవరిలో జెఎంఎం మద్దతు ఉపసంహరించుకున్న తరువాత రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ప్రకటించబడిన విషయం తెలిసిందే. 

హేమంత్ సోరెన్ 38 సంవత్సరాల వయస్సులో పిన్న వయస్కుడైన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.కానీ అతను ఒక సంవత్సర కాలం మాత్రమే పదవిలో ఉన్నాడు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి వచ్చింది. అప్పుడు రఘుబర్ దాస్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. 

 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios