హత్యలా, ఆత్మహత్యనా: వరంగల్‌లో బావిలో శవాలుగా తేలిన తొమ్మిది మంది వలస కూలీలు

వరంగల్ నగర శివారులోని గొర్రెకుంట ప్రాంతంలో ఉన్న గన్నీ సంచుల గోదాంలో శుక్రవారం నాడు మరో ఐదు మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. ఈ బావిలో ఇంకా ఏమైనా మృతదేహాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

seven members of migrant family found dead in Telangana's Warangal district

గీసుకొండ:  వరంగల్ నగర శివారులోని గొర్రెకుంట ప్రాంతంలో ఉన్న గన్నీ సంచుల గోదాంలో శుక్రవారం నాడు మరో ఐదు మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. ఈ బావిలో ఇంకా ఏమైనా మృతదేహాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

గురువారం నాడు రాత్రి నాలుగు మృతదేహాలను వెలికితీశారు. ఇవాళ మరో ఐదు మృతదేహాలను వెలికితీశారు. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురి మృతదేహాలు బావిలో దొరికాయి. అయితే వీరు ఆత్మహత్యకు పాల్పడ్డారా లేదా ఎవరైనా హత్యచేశారా అనే కోణంలో కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఎండీ మక్సూద్, ఆయన భార్య నిషా, కూతురు బుస్రాతో పాటు ఆమె మూడేళ్ల కొడుకు మృతదేహలుగా గుర్తించారు. ఇవాళ లభ్యమైన మూడు మృతదేహాల్లో రెండు మృతదదేహాలను మక్సూద్  ఇద్దరు కొడుకులవిగా భావిస్తున్నారు. మరో మృతదేహాన్ని గుర్తించాల్సి ఉంది.

పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుండి ఉపాధి కోసం మక్సూద్ వరంగల్ కు 20 ఏళ్ల క్రితం వచ్చాడు. కరీమాబాద్ లో అద్దె ఇంట్లో నివాసం ఉండేవాడు. డిసెంబర్ నుండి  గీసుకొండ మండలం గొర్రెకుంటలో ఓ గన్నీ సంచుల తయారీ కేంద్రంలో పనిచేస్తున్నాడు.

also read:వరంగల్‌లో విషాదం: బావిలో శవాలుగా తేలిన నలుగురు వలస కూలీలు

ఈ కుటుంబం ఉండే ఆవరణలోనే బీహార్ రాష్ట్రానికి చెందిన శ్రీరాం, శ్యాం అనే ఇద్దరు యువకులు కూడ నివాసం ఉండేవారు. గురువారం నాడు గోదాం యజమాని సంతోష్ ఇక్కడికి వచ్చి చూస్తే కార్మికులు ఎవరూ కూడ కన్పించలేదు. ఇక్కడ ఉన్న బావిలో నాలుగు మృతదేహాలు కన్పించాయి. ఇవాళ మరో ఐదు మృతదేహాలు లభ్యమయ్యాయి.

బావిలో ఉన్న నీటిని మున్సిపల్ అధికారులు తోడుతున్నారు. గొర్రెకుంట బావిలో 9 మృతదేహలు లభ్యం కావడంతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. వీరంతా ఎలా చనిపోయారనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios