#whokilledbabai... బాబాయ్ ని చంపింది అబ్బాయే అనడానికి ఆధారమిదే: అయ్యన్న సంచలనం
ఈనెల 14న వివేకానంద రెడ్డిని ఎవరు చంపారో తేలిపోతుందంటూ సోషల్ మీడియా వేదికన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.
విశాఖపట్నం: వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ వ్యవహారం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో దుమారాన్ని రేపుతోంది. ఈ హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని ముఖ్యమంత్రి జగన్ తిరుమల వెంకన్న సాక్షిగా ప్రమాణం చేస్తారా? అంటూ మాజీ మంత్రి నారా లోకేష్ సవాల్ విసిరారు. ఈ సవాల్ పై మరో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు స్పందిస్తూ... ఈనెల 14న వివేకానంద రెడ్డిని ఎవరు చంపారో తేలిపోతుందంటూ సోషల్ మీడియా వేదికన పేర్కొన్నారు.
''మౌనం అర్దాంగీకారం. బాబాయ్ ని వేసేసింది అబ్బాయే అనడానికి ఇంతకన్నా ఆధారం ఏమి కావాలి?మా లోకేష్ సవాల్ విసిరాడు.14 తేదీన వెంకన్న సాక్షిగా ప్రమాణం చెయ్యడానికి సిద్దమా అని. బాబాయ్ హత్యతో సంబంధం లేకపోతే పులివెందుల పిల్లి మియాం అని ఎందుకు పారిపోయింది? ప్రతి దానికి బిగ్గరగా అరిచే బులుగు బ్యాచ్ ఎందుకు సైలెంట్ అయ్యింది? బాబాయ్ ని ఎవరు చంపారో14న తేలిపోతుంది'' అని అయ్యన్నపాత్రుడు ట్వీట్ చేశారు.
''వైఎస్ వివేకానందరెడ్డి హత్య గురించి లోకమంతా #whokilledbabai అని ప్రశ్నిస్తోంది. అబ్బాయి మాత్రం నోరు విప్పడంలేదు. అక్క సునీత తన తండ్రిని చంపిన హంతకుల్ని పట్టుకోమంటోంది. పట్టుకోగలవా? ఆ గొడ్డలివేటు మీ ఇంటి రూటు చూపిస్తుందని భయమా?'' అని ప్రశ్నించారు.
read more నేనూ అడుగుతున్నాను... మీ బాబాయ్ ని చంపిందెవరు?: జగన్ ను నిలదీసిన లోకేష్
''ఎందుకీ మౌనం సీఎం గారు? అక్క ఢిల్లీలో, చెల్లి తెలంగాణ గల్లీల్లో అన్నే తమకు అన్యాయం చేశాడని రోదిస్తుంటే పట్టించుకోని వైఎస్ జగన్... ఆంధ్రప్రదేశ్ అక్కాచెమ్మలందరికీ న్యాయం చేస్తానని గాలి మాటలు చెబుతున్నాడు'' అని మండిపడ్డారు.
''ఏ2 దొంగ రెడ్డీ! బాబాయ్ గొడ్డలితో గుండెపై పొడుచుకున్నాడా? మీరే గొడ్డలి వేటేసారా? ఓ చెల్లి తెలంగాణా రోడ్లపైనా, మరో చెల్లి ఢిల్లీలో అన్న కాదు అరాచకుడని నినదిస్తూ భయపెడుతున్నారా?'' అని అయ్యన్న పేర్కొన్నారు.