Asianet News TeluguAsianet News Telugu

స్టీల్ ప్లాంట్ ఉద్యోగి చేతివాటం: రాగి తీగను నడుముకు చుట్టుకుని స్మగ్లింగ్

ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడంటారు. విశాఖ నగరంలో ఇలాంటి సంఘటనే జరుగుతోంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో ఎంతగా నిఘా ఏర్పాటు చేసినప్పటికీ దొంగలు రెచ్చిపోతూనే ఉన్నారు. ఒక ఉద్యోగి  ఆరు కేజీల బరువు గల రాగి తీగను నడుముకు చుట్టుకుని దొంగతనంగా బయటకి తీసుకెళ్తూ సీఐఎస్ఎఫ్‌కు పట్టుబడ్డాడు.

Visakhapatnam steel plant employe tries smuggling copper wire
Author
Visakhapatnam, First Published Oct 21, 2019, 3:45 PM IST

ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడంటారు. విశాఖ నగరంలో ఇలాంటి సంఘటనే జరుగుతోంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో ఎంతగా నిఘా ఏర్పాటు చేసినప్పటికీ దొంగలు రెచ్చిపోతూనే ఉన్నారు.

ఇక్కడి భద్రతా చర్యలను సీఐఎస్ఎఫ్ పర్యవేక్షిస్తూ ఉంటుంది. అయినప్పటికీ ప్లాంట్‌లో చోరీలు మాత్రం నిత్యకృత్యమయ్యాయి. ప్రహరీ గోడకు కన్నం పెట్టడం, గోడ లోపల నుంచి బయటకు చోరీ సొత్తును విసరడం, బైకు ట్యాంక్ కింద ప్రత్యేక అమరిక ద్వారా సొత్తును తరలించడం వంటి పద్దతుల్లో దొంగలు చోరీలు చేస్తుండేవారు.

కొన్నిసార్లు భద్రతా సిబ్బంది దొంగలకు అడ్డుకట్ట వేయడంతో వారు రూటు మార్చారు. ఏకంగా శరీరానికి రాగిని చుట్టుకుని చేతుల్లో ఏం లేనట్లుగానే వుండేవారు. ఈ విషయం సీఎస్ఎఫ్ఐ దృష్టికి చేరడంతో శుక్రవారం ఓ వ్యక్తిని పట్టుకున్నారు.

పోలీసులకు మురుగన్ బురిడీ: తెలుగు సినిమాలకు ఫైనాన్స్

స్టీల్ ప్లాంట్ కోక్ ఓవెన్ ఐదో బ్యాటరీలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్న నడుపూరుకు చెందిన జి.మన్మథరావు సాయంత్రం 7 గంటలకు విధులు ముగించుకుని బైక్‌పై ఇంటికి వెళ్తున్నాడు.

బీసీ గేటు వద్ద అతనిని అనుమానించిన భద్రతా సిబ్బంది ఆరు కేజీల బరువు గల రాగి తీగను నడుముకు చుట్టుకుని దొంగతనంగా బయటకి తీసుకెళ్తున్నాడు. వెంటనే అదుపులోకి తీసుకుని స్టీల్ ప్లాంట్ పోలీసులకు అప్పగించారు.

అయితే కేవలం రాగి తీగ మాత్రమే తరలించడం చూస్తే దీని వెనుక పెద్ద ముఠా ఉన్నట్లు కనిపిస్తుంది. నగరంలోని ఏదో ప్రాంతంలో కేబుల్ దాచి అక్కడి నుంచి తీగను వేరు చేసి మరోచోటికి తరలిస్తున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ దొంగతనాలు ఎప్పటి నుంచి జరుగుతున్నాయి.. దీని వెనుక ఏదైనా ముఠా ఉందా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. 

మాదక ద్రవ్యాలు, బంగారం ఇతర వస్తువులను దేశంలోకి అక్రమంగా తరలించాలని స్మగ్లర్లు చేయని ప్రయత్నం లేదు. వాళ్లు ఎన్ని ఎత్తులు వేసినా కస్టమ్స్ అధికారులు పైఎత్తులు వేస్తూ స్మగ్లర్ల ఆటకట్టిస్తున్నారు. తాజాగా కస్టమ్స్ అధికారులకు అనుమానం రాకుండా బ్రహ్మాండంగా ప్లాన్ చేసిన  ఓ వ్యక్తి చివరికి అడ్డంగా దొరికిపోయాడు.

తలకు గుండు.. విగ్గులో గోల్డ్: కొచ్చి అడ్డంగా బుక్కయిన యువకుడు

వివరాల్లోకి వెళితే.. కేరళ రాష్ట్రం మలప్పురానికి చెందిన నౌషద్ అనే వ్యక్తి షార్జా నుంచి కొచ్చి వస్తున్నాడు. కస్టమ్స్ అధికారులకు  దొరక్కుండా కిలో బంగారాన్ని తీసుకెళ్లాలని ప్లాన్ వేశాడు.

ఇందుకోసం తల మధ్య భాగంలో గుండు గీసుకుని అక్కడ బంగారాన్ని దాచిపెట్టి విగ్గుతో  కవర్ చేశాడు. షార్జా  నుంచి కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్నాడు.అయితే అతనిపై కస్టమ్స్  అధికారులకు అనుమానం కలగడంతో విగ్గు తీసి చూశారు. మధ్యలో కనిపించిన బంగారాన్ని చూసి అధికారులు సైతం ఆశ్చర్యపోయారు.

బంగారాన్ని స్వాధీనం చేసుకుని  నౌషద్‌ను అదుపులోకి తీసుకున్నారు. అచ్చం ఇలాంటి ఘటనే బార్సిలోనాలోనూ జరిగింది. ఓ వ్యక్తి రూ.24 లక్షల విలువైన కొకైన్‌ను విగ్గులో దాచుకుని దొరికిపోయాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios