పోలీసులకు మురుగన్ బురిడీ: తెలుగు సినిమాలకు ఫైనాన్స్
లలిత జ్యూయలరీ కేసులో ప్రధాన నిందితుడు మురుగన్ పోలీసులకు చిక్కకుండా అనేక జాగ్రత్తలు తీసుకొన్నాడు. ఈ విషయాన్ని పోలీసులు గుర్తించారు.
లలిత జ్యూయలరీ చోరీ కేసులో ప్రధాన నిందితుడు మురుగన్ పోలీసుల నుండి తప్పించుకొనేందుకు ప్లాస్టిక్ సర్జరీ చేసుకొన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కారణంగానే చాలా చోరీలు చేసినా కూడ మురుగన్ పోలీసుల కంటపడకుండా తప్పించుకొని తిరిగాడని పోలీసులు అభిప్రాయంతో ఉన్నారు.
తిరుచ్చి జిల్లా తిరువెరుంబూరులో మురుగన్ అద్దెకు ఉన్న ఇంటిలో పోలీసులు సోదాలు నిర్వహించిన సమయంలో ఈ విషయం వెలుగు చూసింది. మురుగన్ తన రూపు రేఖల్ని మార్చుకొనేందుకు కట్టుడు పళ్లను పెట్టుకొన్నాడు
అంతేకాదు ప్లాస్టిక్ సర్జరీ చేసుకొన్నాడు. దీంతో తనను ఎవరూ గుర్తుపట్టకుండా జాగ్రత్తలు తీసుకొన్నారని పోలీసులు అభిప్రాయంతో ఉన్నారు.
మురుగన్ తో ఎవరెవరకు సన్నిహితంగా ఉండేవారు మురుగన్ రోజు వారీ కార్యకలాపాలు ఏమిటనే విషయమై కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు. అంతుచిక్కని ప్రశ్నలకు సమాధానం కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మురుగన్ ను విచారిస్తే మరింత సమాచారం దొరికే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.
మురుగన్ 15 ఏళ్లుగా భారీ చోరీలకు పాల్పడుతున్నాడు. ఇప్పటివరకు మురుగన్ పై వంద కేసులున్నాయి. సుమారు రూ. 100 కోట్లను కొల్లగొట్టినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
లలిత జ్యూయలరీ చోరీ కేసులో మురుగన్ ప్రధాన నిందితుడుగా ఉన్నారు. రెండు రోజుల క్రితం బెంగుళూరులో మురుగన్ పోలీసులకు లొంగిపోయాడు.చోరీ చేసిన సొమ్ముతో ఎక్కువగా సినిమాలు తీసినట్టుగా మురుగన్ చెప్పినట్టుగా సమాచారం. మరోవైపు ఈ చోరీ చేసిన సొమ్మును బినామీల పేరుతో మురుగన్ దాచుకొన్నాడని పోలీసులు అనుమానంతో ఉన్నారు.
ఆంధ్రలో సినిమా నిర్మాణాలకు మురుగన్ ఫైనాన్స్ చేసినట్టుగా పలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.మురుగన్ రెండు విలాసవంతమైన కార్లు ఉన్నట్టుగా కూడ ప్రచారం సాగింది.అయితే ఈ రెండు కార్లు ఎక్కడ ఉన్నాయనే విషయమై కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు.
Lalitha jwellars
కస్టడీలోకి తీసుకొన్నా కూడ మురుగన్ పోలీసులకు సమాచారం ఇచ్చే అవకాశాలు తక్కువేనని గతంలో చోటు చేసుకొన్న ఘటనలు చెబుతున్నాయి. బెంగుళూరులోని ఓ పారిశ్రామికవేత్త ఇంట్లో రూ. 3.10 కోట్ల ఆభరణాలను దొంగిలించిన కేసులో మురుగన్ ను పోలీసులు మూడు నెలలపాటు తమ కస్టడీలోకి తీసుకొన్నారు.
లలిత జ్యూయలరీ నుండి దోచుకొన్న ఆభరణాలను విక్రయించారా. దాచిపెట్టారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో కీలకమైన మురుగన్, సురేష్ లు వేర్వేరు ప్రాంతాల్లో లొంగిపోయారు. వీరిద్దరిని ముఖాముఖి విచారిస్తే ప్రయోజనం ఉంటుందనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.