విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన దివ్య హత్య కేసులో పోలీసులు మరింత పురోగతి సాధించారు. ఈ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే దివ్య హత్య కేసులో పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. 

దివ్య భర్త వీరబాబును, బాబాయ్ కృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దివ్య హత్య కేసులో పోలీసులు భర్త కృష్ణ, పిన్ని కాంతవేణి, కృష్ణల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దివ్య హత్య జరిగిన తర్వాత వారు పరారీలో ఉన్నారు. 

Also Read: విశాఖ దివ్య హత్య కేసు..భర్తే ఆమెను అమ్మేసి....

దివ్య తల్లి, తమ్ముడు, అమ్మమ్మ 2015లో హత్యకు గురయ్యారు. అయితే తూర్పు గోదావరి జిల్లా పోలీసుల రికార్డుల్లో మాత్రం వారు అదృశ్యమైనట్లు నమోదై ఉంది. ఇప్పటి వరకు వారి జాడ తెలియలేదు. దీంతో వారు ముగ్గురు కూడా హత్యకు గురైనట్లు అనుమానించారు. నిందితులు కూడా అదే విషయం చెబుతున్నట్లు విశాఖపట్నం పోలీసు కమిషనర్ ఆర్ కె మీనా ఇటీవల చెప్పారు. 

దివ్య అందాన్ని ఎరగా వేసి హంతక ముఠా పెద్ద యెత్తున డబ్బులు సంపాదించింది. డబ్బు విషయంలో ఎదురు తిరగడంతో దివ్యను అత్యంత కిరాతకంగా హత్య చేశారు. 2014లో తనవారిని కోల్పోయిన దివ్య అత్రేయపురం మండలం ర్యాలీకి చెందిన చిన్నమ్మ క్రాంతివేణి సంరక్షణలో దివ్య పెరిగింది. 

Also Read: విశాఖ దివ్య కేసు: ఆరుగురు అరెస్ట్, మేజిస్ట్రేట్ ఎదుట ప్రవేశపెట్టనున్న పోలీసులు

ఆ తర్వాత ఏలేశ్వరానికి చెందిన వీరబాబుతో ఆమెకు పెళ్లయింది. ఆ తర్వాత విశాఖలో స్థిరపడ్డారు. దివ్యను ఆమె భర్తనే వ్యభిచార ముఠాకు అమ్మేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వ్యభిచారం చేయాలని భర్త కూడా ఆమెను చిత్రహింసలకు గురిచేసినట్లు చెబుతున్నారు.