శ్రీకాకుళం- ఆముదాలవలస మధ్యలో మరో రాజధాని...: కూన రవి
ఉత్తరాంధ్ర అంటే ఒక్క విశాఖ పట్నం మాత్రమే కాదన్న విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ తో పాటు వైసిపి ప్రభుత్వం గుర్తించాలని మాజీ విప్ కూన రవి పేర్కొన్నారు.
విశాఖపట్నం: ఉత్తరాంధ్ర అంటే ఒక్క విశాఖపట్నం మాత్రమే కాదని శ్రీకాకుళం కూడా అని ముఖ్యమంత్రి జగన్, ప్రభుత్వం గుర్తించాలన్నారు మాజీ విప్ కూన రవి. అత్యంత వెనుకబడిన ప్రాంతమైన శ్రీకాకుళం జిల్లాతో పాటు విశాఖ లో అభివృద్ది జరిగితేనే ఉత్తరాంధ్ర మొత్తం అభివృద్ది చెందినట్లని అన్నారు.
అసమర్ధపు, అవినీతి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వుండటం దురదృష్టకమరమన్నారు. సాధారణ పౌరులను రోడ్డు మీదకు లాగే పరిస్థితులు ప్రస్తుతం రాష్ట్రంలో ఉత్పన్నమయ్యాయని అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 3 రాజధానులు ఏర్పాటుచేస్తామనడం అనుభవలేమికి నిదర్శనమన్నారు. క్రీస్తు శకం 1310 సంవత్సరంలో ఉన్న తుగ్లక్ పాలనకు నేడు జగ్లక్ పాలనకు తేడా ఏమీ లేదన్నారు. ఆనాటి రావణాసురుని 10 తలలు ఉంటే నేడు జగన్ 3 తలలు కావాలనుకుంటున్నాడని అన్నారు.
కనీసం ఇంటి గుమ్మం దాటని రైతు కుటుంబపు మహిళలు సీఎం అనాలోచిత నిర్ణయం వల్ల న్యాయం కోసం రోడ్డెక్కిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అభివృద్ధి పేరుతో నాలుగు ఆఫీసులు పెడితే అభివృద్ధి జరుగుతుందా? అని ప్రశ్నించారు.కార్యాలయాలు పెట్టటం వల్ల అభివృద్ధి జరుగుతుందంటున్న మంత్రి బొత్స సత్తిబాబు కాదు బిత్తర సత్తిబాబు అని సంభోదించారు. ఆనాడు తెలుగు రాష్ట్ర విభజనకు ప్రధాన కారకుడయిన బిత్తర సత్తిబాబు రాష్ట్రాన్ని ముంచే ఓ ఐరన్ లెగ్ అని అన్నారు.
read more రాజీనామాలకు సిద్దమే... లేదంటే:మంత్రి బుగ్గనకు అనురాధ సవాల్
జీఎన్ రావు కమిటీ గురించి కూన రవి మాట్లాడుతూ ఈ కమిటీ అధ్యక్షుడు శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ గా పనిచేశాడని గుర్తుచేశారు. ఇలా ఆయన జిల్లా ప్రజలకు బాగా తెలుసన్నారు. కానీ ఆయన ఆధ్వర్యంలో ఉన్న కమిటీకి చట్టబద్దత లేదన్నారు. నేర చరిత కలిగిన జగన్ ఆలోచనలకు తలాడించి రాష్ట్ర ప్రజల భవిష్యత్తును నాశనం చేసే అనధికార కమిటీ అని అన్నారు.
రాష్ట్రాన్ని 3 ముక్కలుచేసి పరిపాలించాలని అనుకునే ఆలోచనను ప్రభుత్వ పెద్దలు విరమించుకోవాలని సూచించారు. సభలో అందనికి ఆదర్శంగా వుండాల్సిన స్పీకర్ తమ్మినేని సీతారాం అసెంబ్లీ సాక్షిగా అసత్యాలు మాట్లాడారని అన్నారు. ఆయన అంతలా జగన్ ను పొగిడి పొందాలనుకుంటే వ్యక్తిగతంగా ఆ పని చేయాలని... స్పీకర్ గా కాదని సూచించారు.
ఇసుక, మట్టితో కుంభకోణానికి పాల్పడటంతో పాటు ఉద్యోగాలు ఇప్పిస్తానని అమాయకుల వద్ద సీతారాం కోట్లు దండుకున్నారని ఆరోపించారు. మరోసారి అసెంబ్లీ సాక్షిగా ఇలాగే మాట్లాడితే గుడ్డలూడబీకి తరుమి తంతారని హెచ్చరించారు.
read more 101ఏళ్ళ జీవితంలో జగన్ లాంటి సీఎంను చూడలేదు: యడ్లపాటి వెంకట్రావు
''అయ్యా తమ్మినేని... మీ స్వగ్రామం మీ పంచాయితీ పరిధిలో ఇసుకలపేట లాంటి గ్రామాలకు సరయిన రహదారి కల్పించలేకపోయారు. అలాంటి మీకు రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన నిన్నటి ముఖ్యమంత్రి చంద్రబాబు ను విమర్శించే అర్హత ఎక్కడిద. ఉత్తరాంద్ర అభివృద్ధి చెయ్యాలి అంటే పూర్తిగా వెనుకబడిన జిల్లా శ్రీకాకుళంను 3వ రాజధాని చెయ్యండి.
మీకు ఉత్తరాంధ్ర మీద అభిమానం ఉంటే అటు పోర్ట్, ఇటు రైల్వే స్టేషన్, జాతీయ రహదారి అందుబాటులో ఉన్న శ్రీకాకుళంలో రాజధాని ఏర్పాటు చెయ్యండి. ముఖ్యమంత్రి ఆఫీసులు పెడితే అభివృద్ధి అనుకుంటే మాకు మాత్రం అమరావతి మాత్రమే రాజధానిగా కావాలి. పని విభజన కాదు మేము కోరుకునేది ఆర్ధిక అభివృద్ధి కావాలి. అందుకు శ్రీకాకుళం, ఆమదాలవలస మధ్యలో రాజధాని ఏర్పాటు చేయాలి. జిల్లాకు సంబంధించి మంత్రి కూడా ఇదే విషయం ఆలోచించాలి'' అని కూన రవి సూచించారు.