తమ్ముడి వివాదం... మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై పోలీస్ కేసు

టిడిపి సీనియర్ నాయకులు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడిపై నర్సీపట్నం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యింది. 

narsipatnam police filed a case on ex minister ayyannapatrudu

విశాఖపట్నం: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై నర్సీపట్నం పోలీస్ స్టేషన్ లో పోలీస్ కేసు  నమోదయ్యింది. పోలీసుల విధులకు భంగం కలిగించడమే కాకుండే వారిపై పరుష పదజాలంతో దూషణలు చేశాడన్న ఆభియోగాలపై ఆయన కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

ఇటీవల అయ్యన్న సోదరుడు, నర్సీపట్నం మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ చింతకాయల సన్యాసిపాత్రుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. దీని వల్లే వివాదం రాజుకుని చివరకు అయ్యన్నపై కేసు నమోదయ్యే స్థాయికి చేరింది. 

నర్సీపట్నంలోని సన్యాసిపాత్రుడి నివాసంపై వైసిపి జెండా కట్టడం అయ్యన్న, సన్యాసి వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని వీరిని సర్దిచెప్పి  పంపించారు. అయితే మళ్ళీ ఇలాంటి ఘటనలు జరక్కుండా జాగ్రత్తపడ్డ పోలీసులు సన్యాసినాయుడితో పాటు అయ్యన్నపాత్రుడి ఇంటివద్ద పోలీస్ బందోబస్తును ఏర్పాటుచేశారు.

read more  వారివల్ల జగన్ అస్తిత్వానికే ముప్పు... అందుకే రాజధాని మార్పు: జవహర్ 

అయితే ఇంటివద్ద కాపలాగా వున్న పోలీసులతో మాజీ మంత్రి దురుసుగా వ్యవహరించినట్లు, పరుష పదుజాలంతో దూషించినట్లు సమాచారం. ఇలా పోలీస్ విధులకు ఆటంకం కలిగించడం, దూషించడంపై పోలీస్ ఉన్నతాధికారులు  చర్యలు తీసుకున్నారు. మాజీ మంత్రిపై వెంటనే కేసు నమోదు చేయాలన్ని ఉన్నతాధికారుల ఆదేశాలతో అయ్యన్నపాత్రుడిపై కేసు నమోదయ్యింది. 

గతంలో విశాఖపట్టణంలోని త్రీ టౌన్  పోలీస్ స్టేషన్ లో  కూడా అయ్యన్నపాత్రుడుపై పోలీస్‌ కేసు నమోదైంది. ఏపీ సీఎం జగన్‌ను ఉద్దేశిస్తూ కుల, మత, ప్రాంత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని అయ్యన్నపై వైసీపీ నేత వెంకట్రావు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు  ఆయనపై ఐపీసీ 153ఏ, 500,506 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. 

read more  జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన కేశినేని నాని... సెటైరికల్ గా

టీడీపీకి చెందిన కీలక నేతలపై వరుసగా కేసులు నమోదు కావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఉద్దేశ్యపూర్వకంగానే తమ పార్టీ నేతలపై వైఎస్ఆర్‌సీపీ కేసులు నమోదు చేస్తోందని  టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఈ కేసుల కారణంగానే మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్య చేసుకొన్నాడని కూడ టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios