విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ రాజధానిపై పూర్తి  స్పష్టత రాకముందే మరో అంశం తెరపైకి వచ్చింది. మూడు రాజధానుల ప్రకటనపై వివాదం కొనసాగుతున్న సమయలోనే ముఖ్యమంత్రి జగన్ జిల్లాల పెంపుపై కూడా నిర్ణయం తీసుకున్న ప్రచారం జరుగుతోంది. ఇప్పుడున్న జిల్లాల స్థానంలో 25 జిల్లాలను ఏర్పాటు చేయాలని జగన్ ప్రభుత్వం భావిస్తున్న తెలుస్తోంది.  

ఇంకా  రాజధానిపై  తేల్చకమునుపే జిల్లాల పెంపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్న వార్త టిడిపి ఎంపీ కేశినేని నాని ఆగ్రహానికి కారణమయ్యింది. దీంతో ఆయన ఈ నిర్ణయంపై ఘాటైన సెటైర్లు విసిరారు. ''జగన్ గారూ...  మీరు కోరుకుంటున్నట్లు రాష్ట్రమంతా అభివృధి చెందాలంటే కొత్తగా ఏర్పడే 25 జిల్లాలలో జిల్లాకి ఒక్కటి చొప్పున 25 రాజధానులు పెడితే బాగుంటుందేమో ఆలోచించండి.'' అంటూ ట్విట్టర్లో  వ్యగ్యాస్త్రాలు సంధించారు. 

read more  ఏపి ఎక్స్‌ప్రెస్ లో చెలరేగిన మంటలు...భయాందోళనలో ప్రయాణికులు

''శనివారం సీఎం జగన్ కు కాస్త వ్యంగ్యంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు ఎంపీ నాని. '' రాజధాని లేని రాష్ట్రం కోసం ఎంతో త్యాగం చేసి 33,000 ఎకరాలు రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం ఇచ్చిన రైతులకు తన జన్మదినం సందర్భంగా గొప్ప బహుమతి ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారికి హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు'' అంటూ ట్వీట్ చేశారు.

అంతకు ముందు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  3 కాకుంటే 30 రాజధానులు ఏర్పాటుచేస్తామన్న వ్యాఖ్యలపై కూడా  ఎంపీ స్పందించారు. '' 30 కాకపోతే 300 పెట్టు ఇంకా కావాలంటే 3000 పెట్టు నీది నాది ఏమి పోతుంది ప్రజలే కదా నష్ట పోయేది.'' అని సైటైరికల్ గా జవాభిచ్చారు. 

read more అమరావతిలో కొనసాగుతున్న ఉద్యమం... ఉదయమే రోడ్డేక్కిన రైతులు