విశాఖపట్నం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.  అక్కయ్యపాలెం 80ఫిట్ రోడ్డులోని దరి రామచంద్ర నగర్ కు చెందిన యువకుడు కస్తూరి అశోకావర్మ దారుణ హత్యకు గురయ్యాడు. అయితే ఈ హత్యకు పాల్పడింది అతడి తల్లే కావడం మరింత దారుణం. 

వివరాల్లోకి వెళితే...  అక్కయ్యపాలెంకు చెందిన సీతారామరాజు, కస్తూరి వరలక్ష్మి దంపతులు. వీరికి అశోక్ వర్మ, శ్రీదేవి సంతానం. శ్రీదేవికి వెంకటేశ్వర రావు అనే వ్యక్తితో వివాహం అయ్యింది. 

read more  డిగ్రీ విద్యార్ధిని లైవ్ సూసైడ్.. నెల్లూరులో సంచలనం

అయితే కొద్దిరోజులుగా అశోక్ వర్మ కు కుటుంబసభ్యుకు మద్య వివాదం చెలరేగుతున్నట్లు సమాచారం. దీంతో అతడి తల్లి  వరలక్ష్మి, అక్కాబావలు కలిసి అతన్ని అతన్ని అతి దారుణంగా హతమార్చారు.   

ఈ హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అశోక్ వర్మ కుటుంబసభ్యుల పిర్యాదు మేరకు అతడి తల్లి, అక్కాబావలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.