నెల్లూరులో డిగ్రీ విద్యార్ధిని లైవ్ డెత్ కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. రమ్య అనే విద్యార్ధిని ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుంటూ వీడియోను లైవ్ రికార్డ్ చేసింది. తెల్లవారిన తర్వాత తమ బిడ్డ గదిలో నుంచి ఎంతకూ బయటకు రాకపోవడంతో కుటుంబసభ్యులకు అనుమానం వచ్చింది.

తలుపులు పగులగొట్టి చూడగా రమ్య ఉరికి వేలాడుతూ కనిపించింది. దీంతో ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

కాగా తోటి విద్యార్ధుల వేధింపులతోనే తమ బిడ్డ ఆత్మహత్య చేసుకుందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాల్ డేటా, మెసేజ్‌ల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు రమ్య లైవ్ సూసైడ్ నెల్లూరులో సంచలనంగా మారింది.