శ్రీకాకుళం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఆశలపై నీళ్లు చల్లింది. తన తనయుడు ధర్మాన కృష్ణచైతన్యను ఈ స్థానికసంస్థల ఎన్నికల ద్వారా రాజకీయ  రంగప్రవేశం చేయించాలని భావించి నామినేషన్ కూడా వేయించారు. అయితే అతడు శుక్రవారం తన నామినేషన్ ను విత్ డ్రా చేసుకోనున్నట్లు మంత్రి తాజాగా వెల్లడించారు. 

తన కొడుకు చేత నామినేషన్ విత్ డ్రా చేయించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయమే కారణమని మంత్రి వెల్లడించారు. పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తల బంధువులను స్థానిక సంస్థల ఎన్నికల పోటీలో నిలపవద్దని అధిష్టానం ఆదేశించిందని... అందువల్లే కృష్ణచైతన్యను ఫోటీనుండి తప్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అధిష్టానం నిర్ణయమే తమకు శిరోధార్యమని కృష్ణదాస్ పేర్కోన్నారు.

read more  ఎన్నికల రీషెడ్యూల్ కు డిమాండ్...ఎన్నికల కమీషనర్ కు చంద్రబాబు లేఖ

ఎంత సీనియర్ నాయకులైనా పార్టీ నిర్ణయాన్ని గౌరవించి తీరాల్సిందేనని... తాను కూడా అదే పని చేస్తున్నానని అన్నారు. నాయకులు చేసిన త్యాగాన్ని పార్టీ ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటుందన్నారు. ఎవరిని ఎప్పుడు ఎలా వాడుకోవాలో పార్టీకి బాగా తెలుసన్నారు.  స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమన్నారు.

ముఖ్యమంత్రి జగన్ వెంటే మేమున్నాం అని ప్రజలు తెలియజేయడానికి ఈ స్థానిక ఎన్నికలే నిదర్శనమన్నారు. వైసిపి అభ్యర్థులు ఈ స్థానిక ఎన్నికల్లో భారీ విజయాలను అందుకోవడం ఖాయమన్నారు మంత్రి ధర్మాన కృష్ణదాస్.