Asianet News TeluguAsianet News Telugu

అందుకోసమైతే చంద్రబాబు దేనికైనా సిద్దం...లేకపోతే మాత్రం..: మంత్రి అవంతి

విశాఖకు రాజధాని రాకుండా అడ్డుపడుతున్న చంద్రబాబు నాయుడు ఆ ప్రాంతంలో  పర్యటించే హక్కు లేదని మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. 

Minister Avanti Srinivas Satirical Comments On Chandrababu
Author
Visakhapatnam, First Published Feb 4, 2020, 5:42 PM IST

విశాఖపట్నం: ఆంధ్ర ప్రదేశ్ అంటే 13 జిల్లాలని... కానీ అన్ని ప్రాంతాలకు కాకుండా కేవలం ఒకే  ప్రాంతానికి ఆదాయం వచ్చేలా మాత్రమే ఇదివరకున్న చంద్రబాబు ప్రభుత్వం పనిచేసిందని మంత్రి అవంతి శ్రీనివాస రావు ఆరోపించారు. దీని వల్ల ప్రాంతాలు,  ప్రజల మధ్య అసమానతలు పెరిగి మరోసారి ఉద్యమాలు వచ్చే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. కాబట్టి రాష్ట్రంలోని యావత్ ప్రాంతాలను అభివృద్ది చేయాలనే సదుద్దేశంతో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి తెలిపారు. 

ఈ క్రమంలోనే రాష్ట్రానికి మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. అయితే దీన్ని అడ్డుకోడానికి మరీ ముఖ్యంగా విశాఖకు రాజధాని రాకుండా చూసేందుకు మాజీ సీఎం చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఆయన వైజాగ్ అంటే ఎందుకంత ద్వేషమే అర్ధంకావడం లేదన్నారు. ఆయన వైజాగ్ లో అడుగుపెడితే బుద్ధి లేనట్టే భావిస్తామని అన్నారు. 

read more కేసీఆర్ కు జగన్ బినామీ... అందుకోసమే...: నిమ్మల సంచలన వ్యాఖ్యలు

విశాఖపట్నం రాజధానిగా ఎందుకు పనికిరాదో చంద్రబాబే చెప్పాలని నిలదీశారు. ఈ నగరం ఏమైనా అడవి అనుకుంటున్నారా?అని ప్రశ్నించారు. ఓట్లు, సీట్ల కోసం అయితే వైజాగ్ కావాలి గానీ రాజధాని కోసం వద్దా  అంటూ చంద్రబాబును నిలదీశారు మంత్రి అవంతి. 

ఉత్తరాంధ్ర ప్రజలు లేకుండానే సీఎం అయ్యవా...? అంటూ చంద్రబాబును ప్రశ్నించారు. అవసరముంటే చంద్రబాబు దేనికైనా సిద్ధం అవుతారని....లేకపోతే అస్సలు  పట్టించుకోడని  అన్నారు. మొత్తంగా ప్రస్తుతం విశాఖ ఇమేజ్, రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతీసేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని... ఇలాంటి  పనులుమానుకోవాలని     అవంతి సూచించారు. తుగ్లక్, ఫ్యాక్టనిస్ట్ అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రిని అవమానించేలా మాట్లాడటం మంచి పద్దతి కాదని హెచ్చరించారు. 

read more  ఆయనేం సృష్టికర్త కాదు... అనుకుంటాడు అంతే..: యనమలపై బొత్స సెటైర్లు

నదుల్లో కేవలం పెద్ద  బోట్లకు మాత్రమే పర్మిషన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.  బోటులో ప్రయాణించే ప్రయాణికులు భద్రత కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ నెల 20వ తేదీ నుండి 9 కంట్రోల్ రూమ్స్ అందుబాటులో ఉంటాయని ప్రకటించారు. బొట్లన్నీ కంట్రోల్ రూమ్ పర్యవేక్షణ లో తిరుగుతాయని మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios