రెండు నెలలు మనవడితో ఆడుకుని వచ్చారు: చంద్రబాబుపై అవంతి కామెంట్స్
మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుపై మంత్రి అవంతి శ్రీనివాస్ విరుచుకుపడ్డారు.
విశాఖపట్నం: ఆంధ్ర ప్రదేశ్ పరిపాలన రాజధానిగా విశాఖపట్నం ఏర్పడటం ఖాయమని మంత్రి అవంతి శ్రీనివాసరావు వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజధాని రావడం ఖాయమని... దీన్ని ఎవరూ అడ్డుకోలేరని మంత్రి స్పష్టం చేశారు.
ఎన్నికల తర్వాత విశాఖ ఉత్తర నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కనిపించడం లేదని అన్నారు. హ్యాండ్ కర్చీఫ్ మార్చినట్టు పార్టీ మార్చే ఎమ్మెల్యే గంటా అంటూ ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబుతో కలిసి గంటా రాజకీయ వ్యాపారం చేస్తున్నారని అవంతి ఆరోపించారు.
రాష్ట్రం యావత్తు కరోనా కష్టాల్లో వున్న రెండు నెలలూ చంద్రబాబు తెలంగాణాలో హాయిగా మనవడితో ఆడుకున్నాడని... అలాంటిది ఆయనకు స్వాగతం ఎందుకు పలికారో అర్థం కావడం లేదన్నారు. ఆయన రెండు నెలలు ఏం ఘనకార్యం చేసినట్టు అని ప్రశ్నించారు.
read more లీడ్ క్యాప్ భూముల వ్యవహారం... టిడిపి నిజనిర్ధారణ కమిటీని అడ్డుకున్న పోలీసులు
ఉత్తర నియోజక వర్గం ఎమ్మెల్యే గంటా పేరు మీరు మర్చిపోవడం మంచిదే అని ప్రజలకు సూచించారు. రాష్ట్ర అభివృద్ధిని చంద్రబాబు నాయుడు అడ్డుకోవడమే పనిగా వుందని అవంతి మండిపడ్డారు.
రాష్ట్రంలో మద్యం అమ్మకాలను తగ్గిస్తే అన్ని బ్రాండ్ లు అమ్మడం లేదని చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఆదాయం కోసం చంద్రబాబు జనానికి మందు పోయించారని... తాము అలా చేయడం లేదన్నారు.
కేరళకు మించిన అక్షరాస్యత కోసం అమ్మ ఒడి పథకాన్ని సీఎం జగన్ అమలు చేస్తున్నారని అన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేను గెలిపించక పోయినా విశాఖ ఉత్తర ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందించారని అవంతి వెల్లడించారు.