భర్త పరాయి మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయిన ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నం జిల్లా నక్కపల్లి టీచర్స్ కాలనీకి చెందిన కొప్పిశెట్టి చినరాజుకు డొంకాడకు చెందిన నాగ వరలక్ష్మీతో 8 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది.

ఇన్నేళ్లయినా ఈ దంపతులకు సంతానం కలగలేదు. దీంతో చినరాజు మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం వరలక్ష్మీకి తెలియడంతో ఆమె భర్తను నిలదీసింది.

Also Read:యువకుడితో కోడలి అక్రమ సంబంధం: ఇద్దరి ముక్కులు కోసేసిన మావయ్య

ఇద్దరి మధ్యా తరచుగా గొడవలు జరుగుతుండటంతో పెద్దల పంచాయతీలు నిత్యకృత్యం అయ్యాయి. ఈ క్రమంలో వివాహేతర సంబంధం పెట్టుకున్న యువతిని రాజు శనివారం ఏకంగా ఇంటికి తీసుకురావడంతో వరలక్ష్మీకి ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

ఇదేంటని భర్తతో ఘర్షణకు దిగింది. ఇది ముదరడంతో ఇంటికి వచ్చిన యువతి అదే ఇంటి మేడపై నుంచి కిందకు దూకింది. ఈ పరిణామాన్ని ఊహించని రాజు.. వరలక్ష్మీని తీవ్రంగా మందలించాడు. అనంతరం తీవ్ర గాయాలపాలైన యువతిని ఆస్పత్రికి తరలించాడు.

Also Read:అమ్మకి ఇద్దరితో అక్రమ సంబంధం.. ఇంట్లో బంధించి...

భర్త మందలించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన వరలక్ష్మీ ఇంట్లోకి వెళ్లి సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఊరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమెను గమనించిన స్థానికులు విషయాన్ని కొత్తూరులో ఉంటున్న వరలక్ష్మీ సోదరికి సమాచారం అందించారు.

అత్తమామలు, భర్త, వివాహేతర సంబంధం పెట్టుకున్న యువతి వేధింపుల కారణంగానే వరలక్ష్మీ ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి సోదరి ఆరోపించారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.