కొత్త జిల్లాల ఏర్పాటు... ఆ జిల్లాకు అల్లూరి పేరు: మంత్రి అవంతి

విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు 123 వ జయంతి సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ విశాఖ బీచ్ రోడ్డు వద్దగల అల్లూరి విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

avanthi srinivas intresting comments on new districts

విశాఖపట్నం: విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు 123 వ జయంతి సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ విశాఖ బీచ్ రోడ్డు వద్దగల అల్లూరి విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... వచ్చే ఏడాది అల్లూరి జయంతి నాటికి కేడీ పేటలో సమాధిని, పాండ్రంగి మ్యూజియం అభివృద్ధి చేయడానికి రెండు వందల కోట్లు కేటాయించామని తెలిపారు. రాబోయే రోజుల్లో ఒక జిల్లాకు అల్లూరి పేరును నామకరణం చేస్తామన్నారు. యువత అల్లూరి సీతారామరాజును ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి అవంతి పిలుపునిచ్చారు.  

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న జిల్లాలకు అదనంగా మరికొన్ని జిల్లాలను ఏర్పాటు చేసేందుకు వైసిపి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేసే ఆలోచన ఉందని సీఎం ప్రకటించారు. ఎన్నికల సమయంలో ఇదే విషయాన్ని జగన్ ప్రజలకు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో  సీఎం కొత్త జిల్లాల ఏర్పాటు విషయాన్ని ప్రస్తావించారు.

read more  ఆనాడు మన్యం ప్రజలకు అల్లూరి... ఈనాడు రాజధాని ప్రజలకు..: నారా లోకేష్

ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేసే ఆలోచన ఉందని ఈ సమావేశంలో సీఎం చెప్పారు. కొత్త జిల్లాల ఏర్పాటు విషయమై అధికార యంత్రాంగం కసరత్తు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. 

రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రం కూడ జిల్లాల పునర్వవ్యస్థీకరించింది. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణలో 10 జిల్లాలు ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణలో జిల్లాల సంఖ్య 33కి చేరుకొన్నాయి. ఇక ఏపీలో కూడ జిల్లాలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఏపీ ప్రభుత్వం మాత్రం పార్లమెంట్ నియోజకవర్గానికో కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తోంది.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios