గుంటూరు: బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటంసాగించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆయనకు మాజీ మంత్రి నారా లోకేష్ నివాళులు అర్పించారు. ప్రస్తుతం రాజధాని అమరావతి ప్రజల మాదిరిగానే ఆనాడు కూడా తెల్లదొరలు కూడా మన్యం ప్రజల హక్కులను కాలరాశారని... వారికి అండగా నిలిచి అల్లూరి పోరాటం చేశారని అన్నారు. అల్లూరి స్పూర్తిని అందుకుని రాష్ట్ర ప్రజలకు కూడా ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలపై పోరాడాలని  లోకేష్ సూచించారు. 

''ఈరోజు రాజధాని ప్రాంత ప్రజలపై వైసీపీ ప్రభుత్వం సాగిస్తోన్న దారుణ మారణకాండ మాదిరిగానే...  ఆరోజు మన్నెం ప్రజల హక్కులను తెల్లదొరలు కాలరాశారు. అయితే నాడు గిరిజనులందరినీ ఏకంచేసి తెల్లవారి గుండెలదిరేలా చేసారు అల్లూరి సీతారామరాజు '' అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. 

''నాటి అల్లూరి స్ఫూర్తిని రాష్ట్ర ప్రజలందరూ అందుకోవాలి. అన్యాయం ఎక్కడ జరిగినా అడ్డుకునే కథానాయకులై రాజధాని అమరావతి రైతులకు అండగా నిలవాలి. అల్లూరి జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులర్పిస్తున్నాను'' అంటూ సోషల్ మీడియా వేదికన లోకేష్ స్పందించారు. 

read more  కొల్లు రవీంద్ర అరెస్ట్.. జగన్ ది రాక్షసానందమంటున్న లోకేష్

''మూడు రాజధానుల పేరుతో ఏపీని ముక్కలు చేయాలని చూస్తున్నారు. 3 ముక్కలాటకు ఇప్పటికే 64 మంది రాజధాని రైతులు బలయ్యారు. 200 రోజులుగా రైతులు ఆందోళన చేస్తుంటే తేలిగ్గా తీసుకుంటారా? విధ్వంసకర పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం ఇది.  ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని అంటూ అమరావతి కోసం ఉద్యమిద్దాం'' అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సూచించారు.