సీఎం జగన్ విశాఖ పర్యటన... ఎలా సాగనుందంటే...

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు అంటే శనివారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. వివిధ  ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. 

AP CM YS Jagan Visakhapatnam tour schedule

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ శనివారం విశాఖపట్నంలో పర్యటించారు.  వివిధ ప్రభుత్వ కార్యాక్రమాల్లో పాల్గొనేందుకు ఆయన ఒకరోజు విశాఖలో పర్యటిస్తున్నారు. సీఎం పర్యటనను పురస్కరించుకుని విశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.  

రేపు మధ్యాహ్నం 2.30 గంటలకి గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో జగన్ బయలుదేరనున్నారు. విశాఖ ఎయిర్ పోర్టులో దిగిన వెంటనే నేరుగా  కైలాసగిరి వద్దకు చేరుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంఖుస్థాపన చేయనున్నారు. అక్కడి నుండి డాక్టర్ వైఎస్ఆర్ సెంట్రల్ పార్క్ వద్దకు చేరుకుని పలు అభివృద్ధి  పనులకు శంఖుస్థాపన  చేయనున్నారు. 

సాయంత్రం 5.30-6.00 గంటలకు రామకృష్ణ బీచ్ వద్దకు చేరుకుని ఘనంగా ఏర్పాట్లుచేసిన విశాఖ ఉత్సవ్ 2019ని ప్రారంభించనున్నారు. కాస్సేపు ఈ కార్యక్రమాలను తిలకించి నేరుగా విశాఖ ఎయిర్ పోర్టుకు అక్కడి నుండి 7.40కి  తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు. 

read more  రివర్స్ టెండరింగ్ సూపర్ సక్సెస్... తాజాగా మరింత ఆదా: బొత్స

విశాఖకు వివిధ అభివృద్ధి పనుల కోసం పాలనా అనుమతులిస్తూ ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఏడు జీవోల ద్వారా మొత్తం రూ.394.50 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు సర్కార్ పాలనా అనుమతులు ఇచ్చింది.

కాపులుప్పాడ సమీపంలోని బయో మైనింగ్ ప్రాసెస్ ప్లాంట్ కోసం రూ. 22.50 కోట్లు, కైలాసగిరి ప్లానిటోరియం కోసం రూ. 37 కోట్లు కేటాయించింది. అలాగే సిరిపురం జంక్షన్లో మల్టీ లెవల్ కార్ పార్కింగ్ అండ్ వాణిజ్య సముదాయం కోసం రూ. 80 కోట్లు, నేచురల్ హిస్టరీ పార్క్.. మ్యూజియం రిసెర్చ్ సంస్థ కోసం రూ. 88 కోట్లను మంజూరు చేసింది.

నాతయ్యపాలెం జంక్షన్ సమీపంలోని చుక్కవాని పాలెంలో రహాదారి నిర్మాణం కోసం రూ. 90 కోట్లు, సమీకృత మ్యూజియం, టూరిజం కాంప్లెక్స్ నిర్మాణం, బీచ్ రోడ్డులో భూగర్భ పార్కింగ్ కోసం రూ. 40 కోట్లు ఇవ్వాలని నిర్ణయించింది. వీటితో పాటుగా ఐటీ సెజ్ నుంచి బీచ్ రోడ్ నిర్మాణం కోసం రూ. 75 కోట్లు విడుదల చేయనుంది. 

కాగా విశాఖకు చెందిన టీడీపీకి మాజీ ఎమ్మెల్యే రహమాన్ గురువారం నాడు రాజీనామా చేశారు. ఎన్ఆర్‌సీ, రాజధాని అంశంపై టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు వైఖరిని నిరసిస్తూ రహమాన్ టీడీపీకి రాజీనామా చేశారు.

ఈ నెల 24వ తేదీ సాయంత్రం విశాఖపట్టణంలోని ఓ హోటల్ లో టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశమయ్యారు. విశాఖకు ఎగ్జిక్యూటివ్ రాజధాని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను టీడీపీ నేతలు స్వాగతించారు.

read more  వైన్స్ లు, బార్లు తగ్గించి వాటిని పెంచుతున్నాం... అయినా విమర్శలే: జగన్

ఈ సమావేశంలో విశాఖకు ఎగ్జిక్యూటివ్ రాజధాని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను సమర్ధిస్తూ తీర్మానం చేశారు.ఈ తీర్మానాన్ని చంద్రబాబుకు పంపారు.ఈ తీర్మానం పంపిన రెండు రోజులకే రహమాన్  టీడీపీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను చంద్రబాబునాయుడుకు పంపారు.

మూడు రాజధానుల అంశాన్ని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు వ్యతిరేకిస్తున్నారు. అమరావతిలోనే రాజధాని ఉండాలని చంద్రబాబునాయడు కోరుతున్నారు.మూడు రాజధానుల అంశంపై ఎవరూ కూడ మాట్లాడకూడదని చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు సూచించారు.

 విశాఖ ను ఎక్సిక్యూటివ్ క్యాపిటల్ గా జగన్ తీషుకున్న నిర్ణయాన్ని తాను సమర్ధిస్తున్నట్టుగా ఆయన తెలిపారు. చంద్రబాబు స్వార్థ రాజకీయాల కోసం విశాఖ నేతలు బలయ్యారని రహమాన్ విమర్శించారు. రాజధాని రైతుల ఆక్రందన కు చంద్రబాబు తీసుకొన్న నిర్ణయాలే కారణమన్నారు.

సీఎం జగన్ కూడా రైతుల పరిస్థితి పై ఆలోచించాలన్నారు. త్వరలోనే రహమాన్ వైసీపీలో చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి ఆయన ఇంకా ప్రకటన చేయాల్సి ఉంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios