డిగ్రీ 4 ఏళ్లు, బీటెక్ 5 ఏళ్లు.. విద్యా వ్యవస్ధలో మార్పులు: సీఎం జగన్
పాఠశాల విద్యతో మొదలు పెట్టి, ఉన్నత విద్యా రంగంలోనూ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు.
పాఠశాల విద్యతో మొదలు పెట్టి, ఉన్నత విద్యా రంగంలోనూ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. శుక్రవారం విశాఖ ఆంధ్రా యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో సీఎం పాల్గొని ప్రసంగించారు.
సర్ సీఆర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైన ఆంధ్ర విశ్వవిద్యాలయం ఒక్క రాష్ట్రమే కాకుండా, దేశం, ప్రపంచంలోనే గొప్ప మేధావులను అందించిందని ఆయన గుర్తుచేశారు. ఉద్యోగ, ఉపాధ కల్పనకు దోహదపడేలా ఉన్నత విద్యా కోర్సులలో మార్పు చేస్తామని సీఎం ప్రకటించారు.
Also Read:రాజధాని మార్పుపై క్లారిటీ... మంత్రి బొత్స లిఖితపూర్వక ప్రకటన
ప్రతి డిగ్రీని హానర్స్ డిగ్రీగా మార్చడంతో పాటు, ఒక ఏడాది తప్పనిసరిగా శిక్షణనిస్తామని తద్వారా నిరుద్యోగ సమస్యను పరిష్కరించవచ్చని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
ఇదే యూనివర్సిటీ వీసీలుగా గొప్ప గొప్ప వ్యక్తులను చూశామన్న సీఎం, భారత రాష్ట్రపతి అయిన డాక్టర్ సర్వేపల్లి రా«ధాకృష్ణన్, ప్రొఫెసర్ కట్టమంచి రామలింగారెడ్డి, ప్రొఫెసర్ శ్రీనివాస అయ్యంగార్ వంటి ఎందరో గొప్ప వ్యక్తులు ఈ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లుగా పని చేశారని గుర్తు చేశారు.
Also Read:దిశ నిందితుల ఎన్‌కౌంటర్: అసెంబ్లీలో జగన్ సంచలన వ్యాఖ్యలు
ఆంధ్ర రాష్ట్రానికే ఇది ఒక గర్వకారణం అన్న ఆయన, దేశంలోని అత్యుత్తమ 5 యూనివర్సిటీల్లో ఒకటిగా ఎదిగే సామర్థ్యం ఆంధ్రా యూనివర్సిటీకి ఉందని జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ‘నాడు–నేడులో భాగంగా ప్రతి స్కూల్ ప్రస్తుత పరిస్థితి ఫోటో తీస్తాము. వాటిలో సదుపాయాలు కల్పించాక మళ్లీ ఫోటో తీస్తాము. రెండింటినీ చూపి ఆ స్కూల్‌లో ఎలాంటి మార్పు తీసుకువచ్చామన్నది వివరిస్తాము’ అని సీఎం వివరించారు.
వచ్చే ఏడాది జూన్ నుంచి 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియమ్ ప్రవేశపెడుతున్నామని, ఆ మరుసటి ఏడాది 7వ తరగతి, ఆ తర్వాత 8వ తరగతి, అనంతరం 9వ తరగతి, ఆ తర్వాత 10వ తరగతిలోనూ ఇంగ్లిష్ మీడియమ్ ప్రవేశపెడతామని జగన్ ప్రకటించారు.
Also Read;సత్వర న్యాయం: ఏపీ దిశ చట్టంలోని ముఖ్యాంశాలు ఇవే..
విద్యార్థులు బాగా చదువుకునేలా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేయడంతో పాటు, ఆ విద్యార్థులకు హాస్టల్, మెస్ ఛార్జీల కింద ‘విద్యా దీవెన’ కింద ఏటా రెండు దఫాల్లో ఏటా రూ.20 వేలు ఇవ్వబోతున్నామని జగన్ వెల్లడించారు.