Asianet News TeluguAsianet News Telugu

సత్వర న్యాయం: ఏపీ దిశ చట్టంలోని ముఖ్యాంశాలు ఇవే..

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల  మహిళా రక్షణకు సంబందించి సంచలన నిర్ణయంతీసుకుంది. దిశా చట్టాన్ని తీసుకువస్తున్నట్లు ప్రకటించిన జగన్ ప్రభుత్వం అందుకోసం అసెంబ్లీ సాక్షిగా ముందకు కదిలింది.  

Salient features of Andhra Pradesh AP Disha act
Author
Amaravathi, First Published Dec 13, 2019, 3:08 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

అమరావతి: మహిళలు, చిన్నారుల రక్షణ కోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల కామాంధుల చేతిలో దారుణ హత్యకు గురయిన దిశ పేరిట ఓ ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఈ మేరకు మంత్రిమండలి ఆమోదాన్ని  పొందిన ''దిశ యాక్ట్''  కు సంబంధించిన  బిల్లు ఏపి అసెంబ్లీలో ఆమోదం పొందింది. 
  
 ఈ నేపథ్యంలో చట్టంలోని అంశాలను పరిశీలిద్దాం. 

1. కేంద్ర ప్రభుత్వం చట్టంప్రకారం, నిర్భయ కేసుల్లో  జైలు లేదా మరణదండనను శిక్షగా విధిస్తుంటే తాజాగా రాష్ట్రం ప్రవేశపెట్టిన చట్టం ద్వారా రేప్‌ చేసినవారికి తప్పనిసరిగా మరణదండన విధిస్తారు. 

2.నిర్భయం చట్టం ప్రకారం 2 నెలల్లో దర్యాప్తు పూర్తి, మరో 2  నెలల్లో శిక్షలు పడాలి. అంటే మొత్తం 4 నెలల్లో దర్యాప్తు, న్యాయ ప్రక్రియ ఈరెండూ పూర్తికావాలి. దీన్ని ఏపీ దిశ చట్టంలో 4 నెలలకు కాదు 21 రోజులకు కుదించారు.  అత్యాచార నేరాల్లో విస్పష్టమైన, తిరుగులేని ఆధారాలు లభించినట్లయితే 21 రోజుల్లోపే నిందితుడికి శిక్ష పడాలి. వారంరోజుల్లో పోలీసు దర్యాప్తు పూర్తికావాలి. 14 రోజుల్లోపే న్యాయప్రక్రియ పూరెయి శిక్షపడాలి. 

3. అత్యాచార సంఘటనల్లో మాత్రమే కాకుండా పిల్లలపై లైంగిక నేరాలన్నింటికీ కూడా శిక్షల్ని పెంచారు.  కేంద్రం చేసిన ‘‘పోక్సో’’ చట్టం ప్రకారం పిల్లలపై లైంగిక నేరాలు, లైంగిక వేధింపులకు కనీసం 3 ఏళ్ల నుంచి 7 ఏళ్ల వరకూ శిక్ష విధించవచ్చు. కానీ రాష్ట్రంలో ఆ శిక్షను జీవితఖైదుగా మార్చారు. అంటే పిల్లలపై ఇక ఎలాంటి లైంగిక నేరాలుచేసినా జీవితాంతం జైల్లో ఉండటమో, లేక ఉరికంబం ఎక్కడమో శిక్ష అవుతుంది. 

ఏపీలో దిశ బిల్లు: కేసీఆర్‌కు మరో సారి హాట్సాఫ్ చెప్పిన జగన్

4. అత్యాచార నేరాలకు మాత్రమే కాకుండా పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడిన వారి విషయంలో కేంద్రం విధించిన ఒక ఏడాది గడువుకు బదులు దర్యాప్తు 7 రోజుల్లో చేసి, న్యాయ ప్రక్రియ 14 పనిదినాల్లో పూర్తిచేసేలా చట్టానికి సవరణ తీసుకువచ్చారు.

5. సోషల్‌మీడియా ద్వారా మహిళలను వేధించడం, వారిపై అసభ్య పోస్టింగులు పెట్టడం లాంటివి చేస్తే ఐపీసీ ప్రకారం ఇప్పటివరకూ శిక్షలు నిర్దిష్టంగా లేవు. ఈ చట్టం ద్వారా మెయిల్స్‌ద్వారా గాని, సోషల్‌ మీడియాద్వారా గాని, డిజిటల్‌ విధానంలోగాని మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లయితే మొదటి తప్పుకు 2 ఏళ్లు, ఆతర్వాత తప్పుకు 4 ఏళ్లు శిక్ష విధించేలా ఐపీసీలో 354 (ఇ) అనే కొత్త సెక్షన్‌ను తీసుకు వచ్చారు.

6. ఇంతవరకూ దేశంలోని ఏ రాష్ట్రంలోనూ మహిళలపై, పిల్లలపై నేరాల సత్వర విచారణకు ప్రతి జిల్లాలోనూ ప్రత్యేక కోర్టు లేవు. కొద్దిరాష్ట్రాల్లో మాత్రం ఈ నేరాల విచారణకు ప్రత్యేక కోర్టులు ఉన్నాయని కాని జిల్లాకు ఒకటి ఎక్కడా లేదు. దేశ చరిత్రలోనే తొలిసారిగా మహిళలు, పిల్లలపై నేరాల విచారణకు అదికూడా వేగంగా విచారణ ముగించడానికి వీలుగా ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేస్తున్నారు. ఈ కోర్టుల్లో అత్యాచారం, సామూహిక అత్యాచారం, యాసిడ్‌ దాడులు, సోషల్‌మీడియా ద్వారా అసభ్యంగా చూపించడం, వేధించడం వంటి నేరాలు, పోక్సో పరిధిలోకి వచ్చే అన్ని నేరాలు ఈ కోర్టు పరిధిలోకి తీసుకువచ్చారు. 

7. ఇక ఈ నేరాలపై దోషులు పైకోర్టుకు వెళ్లి అప్పీలు చేసుకునే గడువును కూడా కేంద్ర ప్రభుత్వం చట్టంలో ఉన్న 6 నెలల కాలాన్ని రాష్ట్ర పరిధిలో కేవలం 3 నెలలకు తగ్గించారు.

read more అన్నోచ్చాడు... జగనన్న వచ్చాడన్న నమ్మకం కలిగింది...నాకే కాదు...: మంత్రి పుష్పశ్రీవాణి

8. మహిళలు, పిల్లలపై నేరాల సత్వర విచారణ, శిక్షల విధింపు కోసం ప్రత్యేక పోలీసు బృందాల్ని, ప్రత్యేక పబ్లిక్‌ప్రాసిక్యూటర్లని, ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసేందుకు కేంద్ర చట్టాల్లో ఇప్పటివరకూ ఎటువంటి ఏర్పాట్లు లేవు. అయితే జిల్లా స్థాయిల్లో డీఎస్పీ ఆధ్వర్యంలో డిస్ట్రిక్‌ స్పెషల్‌ పోలీస్‌ టీమ్స్‌ను ఇందుకోసం ఏర్పాటు చేసేందుకు ఈచట్టం  ద్వారా వీలు కల్పించారు. అలాగే ప్రతి ప్రత్యేక కోర్టుకు, ప్రత్యేకంగా పబ్లిక్‌ప్రాసిక్యూటర్లని నియమించుకునే అవకాశాన్ని ఇస్తూ ఈ చట్టాన్ని చేశారు. 

9.మహిళలు, పిల్లలపై నేరాలను నమోదు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక నేషనల్‌ రిజిస్ట్రీని పెట్టింది. అయితే ఆ రిజిస్ట్రీ ద్వారా డిజిటల్‌ పద్దతిలో డేటా బేస్‌ ఉంచి, జరిగిన నేరాలు, దాంతో సంబంధం ఉన్న వ్యక్తుల పేర్లు వంటి వివరాలను బహిర్గతం చేసే అవకాశం లేదు. అంటే, ఏ నేరగాడు, ఏ నేరం చేశాడన్న వివరాలు ప్రజలకు తెలిసే అవకాశం లేదు. కాని, అటువంటి డిజిటిల్‌ రిజిస్ట్రీని మన రాష్ట్రంలో ఏర్పాటు చేయడమే కాకుండా ఈ నేరాలకు సంబంధించిన వివరాలు అన్నింటినీ ప్రజలందరికీ అందుబాటులోకి ఉంచడం ద్వారా అఫెండర్ల వివరాలు బహిర్గతం చేయబోతున్నారు. చట్టం ముందే కాకుండా సమాజం ముందు వారిని నిలబెడతారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios