Asianet News TeluguAsianet News Telugu

పిచ్చి అంటారయ్యా దాన్నీ... శవపేటికలో 7 రోజులు సజీవ సమాధి, వ్యూస్ కోసం యూట్యూబర్ ఫీట్..

ఇలా చేయడం అతనికి ఇదేం కొత్త కాదు. 2021లో 50 గంటల పాటు సజీవంగా సమాధి అయ్యి, ఇదే రికార్డుకు ప్రయత్నించాడు.

YouTuber MrBeast Spends 7 Days Being Buried Alive, viral - bsb
Author
First Published Nov 22, 2023, 12:30 PM IST

సజీవ సమాధి ఈ మాట వింటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది కదా.. ఇక దానికి స్వచ్చందంగా ఒప్పుకుని ముందుకు వచ్చి.. ఏడు రోజులపాటు గాజు డబ్బాలో భూమి పొరల్లో నీరవ నిశ్శబ్దంలో.. గాఢాందకారంలో ఉంటే ఎలా ఉంటుంది. చదువుతుంటేనే వెన్నులో వణుకు పుడుతోంది కదా. కానీ ఇలాంటి స్టంట్ కు పూనుకున్నాడో యూట్యూబర్. ఈ విషయాన్ని విన్న వారంతా ఇదేం పిచ్చిరా నాయనా.. అంటూ విమర్శిస్తున్నారు. 

మిస్టర్ బీస్ట్ అనే యూట్యూబర్ ఈ స్టంట్ చేశాడు. ఆయన పూర్తి అంగీకారంతోనే ఏడు రోజులు సజీవంగా భూమిలో పాతిపెట్టాడానికి ఒప్పుకున్నాడు. ఈ వీడియోను షేర్ చేస్తూ అంతను దీనికి  "మానసిక వేదన" అని ట్యాగ్ లైన్ కూడా పెట్టుకున్నాడు. అయితే, ఏడు రోజుల తరువాత బాక్స్ నుంచి బైటికి వచ్చే సమయంలో తీవ్రంగా ఎమోషనల్ అయ్యాడు. పేటిక నుండి బయటకు తీసినప్పుడు సహా పలు సందర్భాల్లో కన్నీళ్లు పెట్టుకున్నాడు.

Miracle: పసిఫిక్ పై నుంచి వెళ్లుతుండగా విమానం పైకొప్పు ఊడిపోయింది.. అనూహ్యంగా..! మిరాకిల్ స్టోరీ ఇదే

మిస్టర్ బీస్ట్ అసలు పేరు జిమ్మీ డొనాల్డ్‌సన్, తన 212 మిలియన్ల యూట్యూబ్ సబ్‌స్క్రైబర్‌లను అలరించడానికి భూగర్భంలో ఒక పెట్టెలో ఒక వారం గడిపాడు. ఈ స్టంట్ తనకు "మానసిక వేదన" కలిగించిందని, దీనిని ఎవ్వరూ ప్రయత్నించవద్దని తన ఫాలోవర్స్ కు డిస్ క్లైమర్ కూడా ఇచ్చాడు.   'కిల్ బిల్'లో ఉమా థుర్మాన్ క్యారెక్టర్ లా సోషల్ మీడియా సంచలనం మిస్టర్ బీస్ట్. వ్యూస్ కోసం చేసిన ఈ స్టంట్ కు అతనికి అతని స్నేహితులు సహకరించారు. 

మొదట అతడిని అత్యాధునిక పారదర్శక శవపేటికలో పెట్టి, అప్పటికే తవ్వి పెట్టిన గొయ్యిలో దించారు. ఈ పేటికలో ఆహారం, నీరు సమకూర్చారు. శవపేటికలో వీడియో రికార్డ్ కోసం కెమెరాలు అమర్చారు. అంతా సేఫ్ అనుకున్న తరువాత యూట్యూబర్ తన స్నేహితులతో కలిసి ఎక్స్‌కవేటర్‌ తో శవపేటిక పైన 20,000 పౌండ్ల మట్టిని చల్లారు. అలా పూర్తిగా సమాధి అయ్యిందని నిర్ధారించుకున్నాడు. 

ఈ స్టంట్ కు ముందు మిస్టర్ బీస్ట్ వీడియోలో, "రాబోయే ఏడు రోజులు నా జీవితాన్ని ఈ శవపేటికకు అప్పగిస్తున్నాను" అని చెప్పాడు. భూమి పైన ఉన్న తన బృందంతో కమ్యూనికేట్ చేయడానికి వాకీ-టాకీని ఉపయోగించాడు. ఈ డేర్‌డెవిల్ అనేక భద్రతా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏడు రోజుల తరువాత చాలా అలసిపోయినట్లుగా అతని బృందం గుర్తించింది. స్టంట్ స్వచ్ఛందంగా జరిగినప్పటికీ,  పేటిక నుండి బయటకు తీసినప్పుడు సహా పలు సందర్భాల్లో కన్నీళ్లు పెట్టుకున్నాడు. 

ఏడు రోజుల పాటు అలాగే, కదలక, మెదలక చిన్న డబ్బాలో ఉండడం వల్ల కాళ్లలో రక్తం గడ్డకట్టడం, నిలబడలేకపోవడం లాంటి ఆరోగ్య సమస్యలూ వచ్చాయి. అదృష్టవశాత్తూ, అతనికి అంతకుమించి ఎలాంటి ఆరోగ్య, మానసిక సమస్యలు తలెత్తలేదు. ఇలా చేయడం అతనికి ఇదేం కొత్త కాదు. 2021లో 50 గంటల పాటు సజీవంగా సమాధి అయ్యి, ఇదే రికార్డుకు ప్రయత్నించాడు.

ఈ స్టంట్ తో బీస్ట్ 2021లో 54 మిలియన్ డాలర్లు  సంపాదించాడు. ఫోర్బ్స్ ప్రకారం, అతను యూట్యూబ్ లో అత్యధికంగా సంపాదించే కంటెంట్ సృష్టికర్తగా ఉన్నాడు. నెలకు యూ ట్యూబ్ నుంచి అతను దాదాపు 5 మిలియన్ డాలర్లు సంపాదించాడని నివేదించబడింది. 2012 నుండి యూట్యూబ్‌లో యాక్టివ్‌గా ఉన్నప్పటికీ, 2018నుంచే బీస్ట్ బాగా పేరు తెచ్చుకున్నాడు.

Follow Us:
Download App:
  • android
  • ios