Viral Video: ఇదెక్కడి మాస్‌రా మామా.! పారాసెట్‌మాల్ ట్యాబ్లెట్‌ని ఇలా కూడా వాడొచ్చా.?
Viral Video: జ్వరం వచ్చిన వెంటనే చాలా మంది పారాసెట్‌మాల్ ట్యాబ్లెట్ వేసుకుంటారు. అయితే ఈ ట్యాబ్లెట్‌ను అందుకు కాకుండా మరో పనికి ఉపయోగించింది ఓ మహిళ. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.?

విచిత్రమైన హోమ్ ట్రిక్
ఓ మహిళ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. అందులో ఆమె, “పారాసెటమాల్ మాత్రతో బట్టలు ఉతికితే మరకలు సులభంగా పోతాయి” అని చెబుతోంది. సబ్బు లేదా డిటర్జెంట్ అవసరం లేకుండా, ఒక బకెట్ నీటిలో పారాసెటమాల్ మాత్ర వేస్తే, దుస్తులు తెల్లగా మెరుస్తాయని ఆమె సూచించింది. మురికిగా ఉన్న లేదా పసుపు రంగులోకి మారిన దుస్తులు కూడా అలా శుభ్రం అవుతాయని వీడియోలో పేర్కొంది.
వీడియో వైరల్, లక్షల్లో వ్యూస్
ఈ వీడియోను @acharyaveda అనే ఎక్స్ యూజర్ పోస్ట్ చేశారు. కొద్దిగంటల్లోనే అది వైరల్‌గా మారింది. “తెల్లని దుస్తుల నుంచి మురికిని తొలగించడానికి సులభమైన మార్గం” అంటూ షేర్ చేసిన ఆ క్లిప్‌ను ఇప్పటివరకు రెండు లక్షల మందికి పైగా చూశారు. వేల మంది లైక్స్, షేర్లు, కామెంట్లు చేయడంతో వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.
నెటిజన్లు ఏమంటున్నారంటే.?
ఈ వీడియోపై నెటిజన్లు సరదాగా స్పందిస్తున్నారు. పారాసెట్‌మాల్‌తో దుస్తులు ఉతికితే, మరి జ్వరం వస్తే డిటర్జెంట్ తినాలా అంటూ ఓ యూజర్ రాసుకొచ్చాడు. మరో యూజర్.. “ఇకపై మెడిసిన్ షాప్‌లో డిటర్జెంట్‌కు బదులు పారాసెట్‌మాల్ ట్యాబ్లెట్లు ఇస్తారా” అని ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.
ఇది నిజంగా పనిచేస్తుందా?
పారాసెట్‌మాల్ ట్యాబ్లెట్ నిజంగానే దుస్తుల్లోని మరకలను తొలగిస్తుందనడంలో నిజం లేదు. ఇందులో అలాంటి రసాయన గుణాలు ఏవీ ఉండవు. పారాసెట్‌మాల్ జ్వరం, నొప్పులు తగ్గించడానికి మాత్రమే ఉపయోగించే ఔషధం. కాబట్టి ఇది బట్టలు శుభ్రం చేయడంలో ఉపయోగపడుతుందన్న వాదనకు శాస్త్రీయ ఆధారం లేదు. అయితే, ఈ వీడియోలోని ఆలోచన వినూత్నంగా ఉందని, గృహిణుల సృజనాత్మకతను చూపుతోందని నెటిజన్లు అంటున్నారు.
నెట్టింట వైరల్ అవుతోన్న వీడియో ఇదే..
सफ़ेद कपडे से मैल हटाने का सबसे आसान तरीका... pic.twitter.com/vQn2Ijhq4T
— 𝗩𝗲𝗱𝗮𝗰𝗵𝗮𝗿𝘆𝗮 (@acharyaveda_) October 5, 2025
వినోదం కోసం మాత్రమే..
ఇలాంటి వీడియోలు కేవలం వినోదం కోసం మాత్రమే ఉపయోగపడతాయని, వాటిని అమలు చేసే ముందు ఆలోచించాల్సిన అవసరం ఉందని నెటిజన్లు సూచిస్తున్నారు. పారాసెట్‌మాల్‌ను నేరుగా చేతులతో టచ్ చేయడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని కూడా అంటున్నారు.