Asianet News TeluguAsianet News Telugu

కూర్చోమన్నాడని.. తోటి ప్రయాణికుడిని కొట్టి, ఉమ్మేసిన మహిళ.. అరెస్ట్ చేసిన ఎఫ్ బిఐ

ఆమె తిరిగి తన సీటు దగ్గరికి వస్తున్నప్పుడు విమానంలో ఫుడ్ సప్లై చేసే బండి అడ్డుగా ఉంది. దీంతో బండిని జరపమని ఆమె అడిగింది. అయితే అక్కడ అందరికీ సర్వ చేస్తున్నందునా.. అప్పటివరకు కాసేపు ఖాళీగా ఉన్న సీట్లో కూర్చోవాలని మరో ప్రయాణికుడు సలహా ఇచ్చాడు. దీంతో కార్న్‌వాల్, "నేనేమైనా రోసా పార్క్స్ నా?" అంటూ - 1955లో ఒక శ్వేతజాతీయుడికి బస్సులో సీటు ఇవ్వడానికి నిరాకరించిన దిగ్గజ ఆఫ్రికన్-అమెరికన్ పౌర హక్కుల కార్యకర్త పేరును ప్రస్తావించింది.

woman punches, spits on another passenger on delta flight arrested video goes viral
Author
Hyderabad, First Published Dec 31, 2021, 10:53 AM IST

టంపా నుండి అట్లాంటాకు వెళ్లే డెల్టా విమానంలో ప్రయాణిస్తున్న ఓ మహిళ తోటి ప్రయాణికుడిపై దాడి చేసింది. అంతటితో ఆగకుండా అతని మీద ఉమ్మివేసింది. దీంతో ఆ మహిళను FBI అధికారులు అరెస్టు చేశారు. న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం.. డిసెంబర్ 23న ప్యాట్రిసియా కార్న్‌వాల్ (51) విమానంలో ప్రయాణిస్తుంది. మధ్యలో బాత్రూమ్ కు వెళ్లి తిరిగి.. తన సీటు దగ్గరికి వెడుతున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. 

ఆమె తిరిగి తన సీటు దగ్గరికి వస్తున్నప్పుడు విమానంలో ఫుడ్ సప్లై చేసే బండి అడ్డుగా ఉంది. దీంతో బండిని జరపమని ఆమె అడిగింది. అయితే అక్కడ అందరికీ సర్వ చేస్తున్నందునా.. అప్పటివరకు కాసేపు ఖాళీగా ఉన్న సీట్లో కూర్చోవాలని మరో ప్రయాణికుడు సలహా ఇచ్చాడు. దీంతో కార్న్‌వాల్, "నేనేమైనా రోసా పార్క్స్ నా?" అంటూ - 1955లో ఒక శ్వేతజాతీయుడికి బస్సులో సీటు ఇవ్వడానికి నిరాకరించిన దిగ్గజ ఆఫ్రికన్-అమెరికన్ పౌర హక్కుల కార్యకర్త పేరును ప్రస్తావించింది.

దీంతో చిర్రెత్తిన పక్క సీట్లో కూర్చున్న వ్యక్తి కార్న్ వాల్ తో... "నువ్వు నల్లజాతీయురాలికి కాదు, ఇది అలబామా కాదు. అంతకంటే ఎక్కువగా ఇది బస్సు కాదు." అని రిటార్ట్ ఇచ్చాడు. దీంతో అది ఘర్షణకు దారితీసింది. ఇద్దరూ చాలాసేపు వాదులాడుకున్నారు. మాటా మాటా పెరిగింది. చివరికి కార్న్‌వాల్ అవతలి వ్యక్తిని కొట్టి ఉమ్మివేసే వరకు పెరిగింది. ఈ దాడిని విమానంలో ప్రయాణిస్తున్న తోటి వ్యక్తి రికార్డు చేయడంతో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది.

సైకో ఉడతకు మరణశిక్ష.. ఇంజక్షన్ చేసి కారుణ్య మరణం...

ఈ వీడియోకు ట్విట్టర్‌లో 9 మిలియన్ల కంటే ఎక్కువ వ్యూస్ ఉన్నాయి. ఈ వీడియోలో కార్న్ వాల్ కు ఎవరో ముందు మాస్క్ పెట్టుకోమని చెప్పడం.. ఆమె తను గొడవపడుతున్న వ్యక్తితో మాస్క్ పెట్టుకోమని అనడం వినిస్తుంది. అదే సమయంలో ఆమె మాస్క్ ముక్కు, మూతికి కాకుండా గడ్డం మీద ఉండడంతో ఆ వ్యక్తి కూడా ‘ముందు నువ్వు పెట్టుకో.....’ అంటూ ఓ బూతు పదం వాడాడు. దీంతో కోపోద్రిక్తురాలైన కార్న్ వాల్ ‘నన్ను అంత మాట అంటావా.. ’ అంటూ అతని మీద చేయి చేసుకుంది. 

దీంతో ఆమెను మిగతా ప్రయాణికులు అక్కడినుంచి ఈడ్చుకెళ్లారు. ఆ తరువాత ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విమానం అట్లాంటాలో ల్యాండ్ అవ్వగానే ఆమెను FBI కస్టడీలోకి తీసుకున్నారు. విమానంలో సేకరించిన వాంగ్మూలాలు, ఐ విట్నెస్ ల ఆధారంగా, అధికారులు కార్న్‌వాల్‌ను అదుపులోకి తీసుకున్నారు" అని ఒక ప్రకటనలో పోలీసులు తెలిపారని న్యూయార్క్ పోస్ట్ తెలిపింది.

ప్యాట్రిసియా కార్న్‌వాల్ సోమవారం మధ్యాహ్నం అట్లాంటాలోని ఫెడరల్ కోర్టుకు హాజరైనట్లు CNN నివేదించింది. ఆమె "యునైటెడ్ స్టేట్స్  ప్రత్యేక ఎయిర్‌క్రాఫ్ట్ అధికార పరిధిలో R.S.M. కొట్టడం, కొట్టడం లేదా గాయపరచడం ద్వారా దాడి చేయడం" అని ఆరోపించబడింది. క్లాస్ A దుష్ప్రవర్తనకు పాల్పడినట్లు తేలితే, ఆమెకు ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష, $1,00,000 వరకు జరిమానా విధించబడుతుంది.

 

Follow Us:
Download App:
  • android
  • ios