సైకో ఉడతకు మరణశిక్ష.. ఇంజక్షన్ చేసి కారుణ్య మరణం...
కొరిన్ రోజూ ఆహారం వేసే చోట ఉచ్చు పెట్టి ఉడతను బంధించింది. ‘ద రాయల్ సొసైటీ ఆఫ్ యానిమల్స్ సంస్థ’ దీన్ని స్వాధీనం చేసుకుంది. దూరంగా అడవిలో వదిలేద్దామంటే స్థానిక చట్టం దీనికి అంగీకరించదు. చంపడం తప్ప మరో మార్గం లేదని నిర్ణయించారు. ఓ పశు వైద్యుడు ఇంజక్షన్ చేసి ఉడతకు కారుణ్య మరణం ప్రసాదించారు.
బ్రిటన్ : సాధు జంతువు అయిన squirrel సైకోలా మరి రెండు రోజుల్లో 18 మందిని గాయపరిచింది. Britain.. ప్లింట్ షైర్లోని బక్లీ పట్టణంలో కొరిన్ రెనాల్డ్స్ అనేక పక్షుల ప్రేమికురాలికి మచ్చికైన ఓ ఉడత రోజూ రోజు ఆమె వద్దకు వచ్చి ఆహారం తీసుకునేది. గతవారం.. క్రిస్మస్ కు కొద్ది రోజుల ముందు అనూహ్య సంఘటన జరిగింది. ఆహారం అందిస్తున్న కొరిన్ చేతినిఉడత Bite చేసి పారిపోయింది. ఇలా ఎందుకు జరిగిందో... అనుకుంటున్న ఆమెకు కొన్ని Facebook posts చూడగానే భయమేసింది. ఫేస్బుక్ పోస్టులన్నీ ఆ ఉడత గురించే. అందరిదీ ఒకటే ఫిర్యాదు. కరుస్తుందని.. సుమారు 16 వేల జనాభా ఉండే బక్లీలో క్రిస్మస్ ఇదే హాట్ టాపిక్ గా మారింది.
ఆ ఉడతకు ‘గ్రెమ్లిన్స్’ సినిమాలోని విలన్ పేరు (స్రైప్) పెట్టారు. ఇలా అయితే కష్టం అనుకున్న కొరిన్ రోజూ ఆహారం వేసే చోట ఉచ్చు పెట్టి ఉడతను బంధించింది. ‘ద రాయల్ సొసైటీ ఆఫ్ యానిమల్స్ సంస్థ’ దీన్ని స్వాధీనం చేసుకుంది. దూరంగా అడవిలో వదిలేద్దామంటే స్థానిక చట్టం దీనికి అంగీకరించదు. చంపడం తప్ప మరో మార్గం లేదని నిర్ణయించారు. ఓ పశు వైద్యుడు ఇంజక్షన్ చేసి ఉడతకు కారుణ్య మరణం ప్రసాదించారు. ఇంత జరిగినా.. ఉడతను నమ్మించి బంధించానే అని కొరిన్ విషాదంలో మునిగిపోయింది.
ఉడుత ఉగ్రరూపం.. రెండు రోజుల్లో 18 మందిపై దాడి.. సోషల్ మీడియాలో బోరుమన్న నెటిజన్లు
కాగా, ఓ ఉడుత యునైటెడ్ కింగ్‌డమ్(UK)లోని వేల్స్ దేశంలో ఉగ్రరూపం చూపింది. ఒక్కొక్కరిని వేటాడి మరీ దాడి చేసింది. ఎదుటి వారు ఏ విధంగానూ రెచ్చగొట్టకున్నా.. ఉడుత దాడి చేసింది. రెండు రోజుల పాటు North Walesలో బీభత్సం సృష్టించింది. కనీసం 18 మందిపై దాడి చేసింది. ఉడుత Attackకి గురైన చాలా మంది తమ ఆవేదనను సోషల్ మీడియాలో వ్యక్తం చేసుకున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండండని, ఈ చుట్టు పక్కల ఓ ఉడుత తిరుగాడుతున్నదని వారు హెచ్చరికలు జారీ చేశారు.
ఓ నెటిజన్ ఫేస్‌బుక్‌లో ఈ దాడుల గురించి పోస్టు చేశారు. వార్నింగ్.. అని పెట్టి.. విషపూరిత ఉడుత దాడి చేస్తున్నదని పేర్కొన్నారు. ఆ ఉడత తనను, తన ఫ్రెండ్‌నూ దాడి చేసిందని వివరించారు. తమతో పాటు ఇతరులను చాలా మందిని ఆ ఉడుత దాడి చేసిందని పేర్కొన్నారు. కాబట్టి.. ఇంటి బయట అడుగుపెడితే జాగ్రత్త వహించండని తెలిపారు.
గ్రెమ్లిన్ సినిమాలో విలన్ పేరును ఈ ఉడుతకు పెట్టారు. స్ట్రైప్ అనే పేరుతో ఆ ఉడుతను వ్యవహరిస్తున్నారు. నిజంగానే ఆ ఉడత విలన్‌లా ప్రవర్తిస్తున్నదని చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు. ఆ ఉడుత (స్ట్రైప్) ఉన్నట్టుండి ఒక్కసారిగా ప్రజలపై దాడికి పూనుకుంది. చాలా మంది కాళ్లను, చేతులను, ఎక్కడ పడితే అక్కడే కొరికింది. కొందరైతే.. బ్యాక్టీరియా ఫామ్ కాకుండా టెటానస్ వ్యాక్సిన్ కూడా వేసుకోవాల్సి వచ్చింది.