Asianet News TeluguAsianet News Telugu

దారుణం : డయాబెటిస్ ఉందని విమానంలోనుంచి దింపేశారు.. ఎక్కడంటే...

టైప్ టూ డయాబెటిస్ ఉందని చెప్పి ఓ మహిళను విమానంలోనుంచి దింపేసిన షాకింగ్ ఘటన యూకేలో చోటు చేసుకుంది. దీనికి ఆలస్యంగా స్పందించిన జెట్ 2 విమానం ఆమెకు క్షమాపణలు తెలిపింది.  

woman kicked off the plane 'for having diabetes' in UK - bsb
Author
First Published Oct 12, 2023, 1:00 PM IST

లండన్ : నేటి రోజుల్లో బీపీ, షుగర్ ప్రతీ ఒక్కరిలోనూ అతి మామూలుగా కనిపిస్తూనే ఉన్నాయి. అయితే లండన్ లోని జెట్ ఎయిర్ వేస్ మాత్రం దీన్ని పెద్ద సీన్ చేసింది. టైప్ 2 డయాబెటిస్ ఉందని ఓ మహిళా ప్రయాణికురాలిని విమానం నుంచి బలవంతంగా దించేసింది. దీనిమీద ఆమె Jet2 విమానయాన సంస్థకు ఫిర్యాదు చేసింది. అయితే, కాస్త ఆలస్యంగా స్పందించిన సంస్థ ఆమెకు క్షమాపణలు చెప్పింది. పర్యటన ఖర్చును తిరిగి చెల్లించింది. 

దీనికి సంబంధించిన వివరాల్లోకి వెడితే.. యూకేకి చెందిన 56 ఏళ్ల హెలెన్ టేలర్ అనే మహిళకు టైప్ 2 డయాబెటిస్ ఉంది. ఈ కారణంగా టేకాఫ్‌కు ముందు జెట్2 విమానం నుండి ఆమెను దింపేస్తున్నట్లు సిబ్బంది తెలిపారు. అక్టోబర్ 2న టేలర్, ఆమె భర్త రోమ్‌కి రొమాంటిక్ ట్రిప్ కోసం వెడుతున్నారు. ఆ సమయంలోనే ఈ సంఘటన జరిగింది. ఫ్లైట్ ఎక్కేప్పుడు ఆమెకు ఎలాంటి సమస్యలు లేవు. 

హమాస్ ను భూమి మీద కనిపించకుండా అంతం చేస్తాం - ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రతిజ్ఞ

అయితే విమానంలోని రెస్ట్ రూంకు వెళ్లివచ్చిన తరువాత కాస్త నలతగా కనిపించింది. దీంతో ఆమె ఆరోగ్యంపై క్యాబిన్ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ఇది తనకు మామూలేనని.. ఆ రోజు మొదటిసారిగా ఆహారం అప్పుడే తీసుకున్నానని.. అందుకే మధుమేహం కారణంగా కొంచెం ఇబ్బంది అయిందని సిబ్బందికి వివరించింది. "నేను పూర్తిగా క్షేమంగా ఉన్నాను. ఇది నా బ్లడ్ షుగర్ లెవలింగ్ మాత్రమే. నాకు కావలసిందల్లా కూర్చుని నీళ్ళు తాగితే చాలు, నేను పూర్తిగా బాగుంటాను" అని ఆమె వారికి హామీ ఇచ్చింది. 

తాను మెనోపాజ్‌లో ఉన్నానని, ఇది చెమటకు కారణమవుతుందని, కొన్ని నిమిషాల్లో తాను కోలుకుంటానని కూడా ఆమె తెలిపింది. ఆమె హామీ ఇచ్చినప్పటికీ, ఒక స్టీవార్డెస్ ఆమెకు వైద్య పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పింది. పది నిమిషాల తర్వాత, అదే స్టీవార్డెస్ తిరిగి వచ్చి టేలర్‌తో ఆరోగ్యకారణాల రీత్యా విమానంలోనుంచి దిగిపోవాలని తెలిపింది. టేలర్ దీన్ని ప్రశ్నించింది. దీంతో ఆ స్టీవార్డెన్ టేలర్ అనారోగ్యంగా కనిపిస్తుందని తెలిపింది. టేలర్ నిరాకరిస్తున్నా.. విమానంలోనుంచి బలవంతంగా దింపేశారు. 

టేలర్ కెప్టెన్‌తో మాట్లాడారు. అతను కూడా ఫ్లయింగ్ కు ఆమె ఆరోగ్యం సహకరించదని అంగీకరిస్తూ, క్యాబిన్ సిబ్బంది నిర్ణయానికి మద్దతు ఇచ్చారు. ఆ తరువాత ఆ జంటను విమానాశ్రయం గుండా తీసుకువెళ్లారు, వారి డ్యూటీ-ఫ్రీ కొనుగోళ్లను తిరిగి ఇవ్వమని బలవంతం చేశారు. బోర్డర్ కంట్రోల్ ద్వారా ప్రశ్నించారు.

"నా జీవితంలో ఇంత హాస్యాస్పదంగా ఏమీ వినలేదు. మాతో ఎలా ప్రవర్తించారో నేను నమ్మలేకపోతున్నాను. ఇది పూర్తిగా పిచ్చిగా ఉంది. ఎవరితోనైనా ఇలా ఎలా ప్రవర్తిస్తారు" అని టేలర్ తన నిరాశను వ్యక్తం చేసింది. నిరాధారమైన సాక్ష్యాధారాల ఆధారంగా విమానయాన సంస్థ నిర్ణయం తీసుకుందని, విమానయానం చేయడానికి ఆమె అనర్హురాలిగా భావించినప్పటికీ ఎటువంటి వైద్య లేదా చలనశీలత సహాయం అందించలేదని ఆమె విమర్శించారు.

ఈ సంఘటన తరువాత, టేలర్ ఈ విషయాన్ని Jet2కి ఫిర్యాదు చేస్తూ.. తమకు తమ నష్టపోయిన సొమ్మును వాపసు కోరుతూ క్లెయిమ్ చేయడానికి అనేకసార్లు సంప్రదించడానికి ప్రయత్నించాడు, కానీ మొదట్లో ఎటువంటి స్పందన రాలేదు. ఆ తరువాత Jet2 క్షమాపణలు చెప్పింది. ఆమె సెలవు ఖర్చును తిరిగి చెల్లిస్తామని ధృవీకరించింది.

"స్వతంత్ర వైద్య విమానయాన నిపుణులతో సంప్రదింపులు జరిపిన తర్వాత, మా కస్టమర్ల ఆరోగ్యం, శ్రేయస్సు, భద్రత ఎల్లప్పుడూ మా మొదటి ప్రాధాన్యతగా మా సిబ్బంది ఈ నిర్ణయం తీసుకున్నారు. అయినప్పటికీ, పూర్తి ప్రాధాన్యతా అంశంగా తదుపరి దర్యాప్తు చేసిన తర్వాత, టేలర్ కు టచ్ లోకి వచ్చాం. ఆమెకు క్షమాపణలు చెప్పాం. సద్భావన సూచనగా ఆమె సెలవుదినాన్ని తిరిగి చెల్లించాం" అని Jet2 ప్రతినిధి తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios