Asianet News TeluguAsianet News Telugu

వార్నీ.. కదులుతున్న కారు బానెట్ ఎక్కిన పెళ్ళికూతురు.. ఫేమస్ పాటకు డ్యాన్స్ చేస్తూ రీల్.. పోలీసులేం చేశారంటే..

ప్రయాగ్ రాజ్ లో ఆదివారం ఒక మహిళ, పెళ్లి కూతురి వేషధారణలో కదులుతున్న కారు బానెట్‌పై కూర్చుని ఇన్‌స్టాగ్రామ్ రీల్‌ చేసిన ఘటన వైరల్ అయ్యింది. 

Woman in bridal dress on moving car bonnet shoots Insta reel In prayagraj - bsb
Author
First Published May 22, 2023, 9:24 AM IST

ప్రయాగ్ రాజ్ : ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేయడం.. వాటికి వ్యూస్, లైక్స్, కామెంట్స్  తెచ్చుకోవడానికి.. తద్వారా సబ్స్క్రైబర్స్ పెంచుకోవడం.. ఈ మాయలో పడి.. అత్యంత భయంకరమైన ఫీట్లకి సాహసం చేస్తున్నారు నేటి యువత.  ఏదైనా వెరైటీగా ఉండాలి.. తద్వారా తాను చేసిన రీల్ వైరల్ కావాలి.  ఇది  నేటి  యువత ఆలోచిస్తున్న విధానం. దీనికోసం కొండల పైకి ఎక్కుతున్నారు,  రైలు ట్రాకుల మీద రైలుతో పోటీ పడుతున్నట్టుగా ప్రయత్నించి ప్రాణాలు కోల్పోతున్నారు. 

ఈ కోవలోనే ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ యువతి మెయిన్ రోడ్డు మీద వెడుతున్న కారు బ్యానర్ మీద కూర్చుని ఇన్స్టాల్ చేసింది.  ఇది చూసినవారు ఇదేం పిచ్చి అంటూ నోరెళ్లబెడుతున్నారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెడితే... అలా కారు బానెట్ మీద కూర్చుని రీల్ చేసింది వర్ణిక.. ప్రయాగ్ రాజ్ జిల్లాలోని సివిల్ లైన్ ఏరియా నివాసి.

సఫారీ లగ్జరీ కారు బానెట్ మీద.. పెళ్లి కూతురి వేషధారణలో కూర్చుని .. ఫోజులిస్తూ... మరీ ఓ ఫేమస్ పాటకు డ్యాన్స్ చేస్తూ రీల్ చేస్తుంది.  ఈ రీల్ ను ఆ తరువాత ఇన్ స్టా అకౌంట్లో షేర్ చేసింది. అది వైరల్ అయ్యింది. దీంతో ట్రాఫిక్ పోలీసుల మీద నెటిజన్లు విరుచుకుపడ్డారు. అలా చేస్తుంటే ఏం చేస్తున్నారంటూ... వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు యువతిని కనుక్కునే పనిలో పడ్డారు.

మార్కులు తక్కువ వచ్చాయని ఆరేళ్ల చెల్లెని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్లి.. కోటి రూపాయిలు కావాలంటూ మెసేజ్..

రీల్ లో ఉన్న కారు నెంబర్ ప్లేట్ ఆధారంగా యువతి వివరాలు కనుక్కున్నారు. ఆమెకు రూ.15,500 జరిమానా కట్టాలంటూ నోటీసులు ఇచ్చారు. మరోసారి ఇలా చేయద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. 

ప్రయాగ్ రాజ్ లోని ఫోష్ గా ఉండే సివిల్ లైన్స్ ప్రాంతంలో చిత్రీకరించబడిన ఈ వీడియో పోస్ట్ చేసిన వెంటనే వైరల్‌గా మారింది. చివరికి ధర్నా స్థల్ పోలీసు అవుట్‌పోస్ట్ ఇంచార్జి అమిత్ సింగ్ దృష్టికి వచ్చింది. దీంతో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆమెకు రూ.16,500లకు రెండు చలాన్లు జారీ చేయబడ్డాయి.

అల్లాపూర్ ప్రాంతానికి చెందిన వర్ణిక అనే మహిళ కొద్దిరోజుల క్రితం పెళ్లి కూతురి వేషధారణలో ఎస్‌యూవీ బానెట్‌పై కూర్చొని రీల్‌ను షూట్ చేసినట్లు కేసు దర్యాప్తులో తేలింది. కొన్ని నెలల క్రితం వర్ణికహెల్మెట్ పెట్టుకోకుండా పెళ్లి కూతురి వేషధారణలో స్కూటర్ కూడా నడిపినట్లు తేలింది.

దీంతో.. ఈ రెండు కేసులను పరిగణనలోకి తీసుకుని కదిలే ఎస్‌యూవీ బానెట్‌పై కూర్చుని రీల్ చేసినందుకు రూ.15,000 చలాన్ జారీ చేయగా, హెల్మెట్ ధరించకుండా స్కూటర్ నడిపినందుకు మరో రూ.1,500 చలాన్ జారీ చేశారు. ఈ కారు వీడియో మే 16న ఆల్ సెయింట్స్ కేథడ్రల్ సమీపంలో షూట్ చేశారని..  స్కూటర్‌పై వీడియోను రెండు నెలల క్రితం చంద్రశేఖర్ ఆజాద్ పార్క్ సమీపంలో రూపొందించారని సబ్ ఇన్‌స్పెక్టర్ అమిత్ సింగ్ తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios