Asianet News TeluguAsianet News Telugu

మార్కులు తక్కువ వచ్చాయని ఆరేళ్ల చెల్లెని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్లి.. కోటి రూపాయిలు కావాలంటూ మెసేజ్..

ఇంటర్ లో మార్కులు తక్కువ వచ్చాయని ఓ బాలిక ఆందోళన చెందింది. తన తల్లిదండ్రుల తిట్ల నుంచి తప్పించుకోవడానికి ఓ కిడ్నాప్ డ్రామా ఆడింది. కోటి రూపాయిలు ఇవ్వాలంటూ తండ్రికి మెసేజ్ పెట్టింది. కానీ చివరికి దొరికిపోయింది. 

He took his six-year-old sister and left the house because of low marks. A message asking for crores of rupees..ISR
Author
First Published May 22, 2023, 7:51 AM IST

పరీక్షల్లో ఫెయిల్ అయితే లేదా మార్కులు తక్కువ వస్తే స్టూడెంట్లు మనస్థాపంతో ఆత్మహత్యకు చేసుకునే ఘటనలు మనం అప్పుడప్పుడు చూస్తుంటాం. కానీ ఓ బాలికకు మార్కులు తక్కువ వచ్చాయని ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయింది. తరువాత కిడ్నాప్ డ్రామాకు తెరలేపింది. తండ్రిని కోటి రూపాయిలు డిమాండ్ చేసింది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లో వెలుగులోకి వచ్చింది.

విషాదం.. బావి శుభ్రం చేస్తుండగా వెలువడిన విష వాయువులు.. ముగ్గురు మృతి

వివరాలు ఇలా ఉన్నాయి. ఇటీవల పశ్చిమ బెంగాల్‌‌లో ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదలయ్యాయి. దక్షిణ కోల్‌కతాలోని బన్స్‌ద్రోణి ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల బాలికకు ఆ పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయి. దీంతో తల్లిదండ్రులు తనను తిడతారని బయపడింది. తరువాత ఇంటికి వెళ్లింది. తన మార్కుల విషయం తల్లిదండ్రులకు తెలిస్తే ఏం జరుగుతుందో అని ఆందోళన చెందింది. దాని నుంచి తప్పించుకోవడానికి ఓ కొత్త ప్లాన్ వేసింది.

ప్రమాణ స్వీకారం చేసిన మరునాడే.. సిద్ధరామయ్య సంచలన నిర్ణయం

ఇంట్లో ఉన్న తన ఆరేళ్ల చెల్లెలిని తీసుకొని బయటకు వెళ్లింది. చాలా సేపటి వరకు ఇంటికి రాలేదు. తరువాత ఓ కొత్త నెంబర్ నుంచి తండ్రికి మెసేజ్ పెట్టింది. అందులో ‘‘ మీ పిల్లలిద్దరినీ కిడ్నాప్ చేశాం. కోటి రూపాయిలు ఇస్తేనే విడిచిపెడుతాం.’’ అని ఉంది. పిల్లలిద్దరూ చాలా సేపటి వరకు ఇంటికి తిరిగి రాకపోవడం, కొత్త నెంబర్ నుంచి ఇలాంటి మెసేజ్ రావడంతో తల్లిదండ్రులు ఇద్దరూ ఆందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బెంగళూరు భారీ వర్షం.. అండర్​ పాస్ లో చిక్కుకున్న కారు.. ఏపీ మహిళ సాఫ్ట్‌వేర్‌ మృతి..

తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. మెసేజ్ వచ్చిన నెంబర్ లొకేషన్ కనిబెట్టారు. దర్యాప్తులో భాగంగా స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల సాయం కూడా తీసుకున్నారు. చివరికి వారు ఉన్న ప్రదేశాన్ని కనిపెట్టారు. ఓ నర్సింగ్ హోం ఎదుట పిల్లలు ఇద్దరూ నిలబడి కనిపించారు. వెంటనే పోలీసులు పిల్లలను తమ వాహనంలో ఎక్కించుకొని తల్లిదండ్రులకు అప్పగించారు. అనంతరం విచారణలో ఇదంతా డ్రామా అని తెలిసి షాక్ కు గురయ్యారు. తల్లిదండ్రులు తిడతారని బయటపడి ఇలా చేశామని ఆ బాలిక ఒప్పుకుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios