ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ మహమ్మారి తమకు ఎక్కడ సోకుతుందోనని జనం వణికిపోతున్నారు. కొందరికి లక్షణాలు లేకుండానే కోవిడ్ 19 అని రావడంతో వైద్యులు సైతం ఆశ్చర్యపోతున్నారు.

ఈ క్రమంలో సొంతవాళ్లను కూడా నమ్మడం కష్టంగా మారింది. ఈ ప్రమాదకర వైరస్ మనుషులపై మానసికంగా కూడా దాడి చేస్తోంది. అందుకే మానవాళి ఆందోళనలో ఉంది. ఈ నేపథ్యంలో తనకు కరోనా పాజిటివ్ అని తెలిసి గుండె పగిలేలా రోదించింది ఓ మహిళ.

Also Read:ఇండియాలో తొలిసారి 24 గంటల్లో రికార్డు స్థాయిలో 20 వేల కేసులు

బీజింగ్‌లో షిజింగ్షాన్ వాండా ప్లాజాలోని ఒక మహిళ ఫోన్ మాట్లాడుతూ... ఒక్కసారిగా పెద్దగా అరస్తూ ఏడవటం ప్రారంభించింది. ఆమె అరుపులు విన్న అక్కడి ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.

ఆమెకు ఏమైందా అని పరీక్షిస్తూ చూశారు. ఇంతలో తనకు కరోనా టెస్ట్‌లో పాజిటివ్‌గా వచ్చిందంటూ పెద్దగా ఏడుపు లంకించుకుంది. ఇది తెలియగానే అక్కడివాళ్లంతా ఆమె దగ్గరి నుంచి పరుగులు తీశారు.

Also Read:రెమిడెసివిర్ డ్రగ్: ఇండియాలో తయారీకి మైలాన్ ల్యాబ్ కు అనుమతి

ఇంత జరుగుతున్నా ఆ మహిళ మాత్రం అక్కడే కూలబడి ఏడ్వసాగింది. ఇదంతా అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యింది. ఆ తర్వాత పీపీఈ కిట్లు ధరించిన మెడికల్ సిబ్బంది వచ్చి ఆమెను అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి.