ఫోన్ కొట్టేసిన దొంగతో ప్రేమలో పడిన మహిళ.. రెండేళ్లుగా సహజీవనం..
ఒక బ్రెజిలియన్ మహిళ తన ఫోన్ కొట్టేసిన వ్యక్తితోనే ప్రేమలో పడింది. రెండేళ్లుగా అతనితో కలిసి ఉంటోంది.
బ్రెజిల్ : ఓ యువతి తన ఫోన్ దొంగిలించిన వ్యక్తితో ప్రేమలో పడింది. గత రెండేళ్లుగా అతనితోనే కలిసి ఉంటోంది. గత వారం, బ్రెజిలియన్ జర్నలిస్ట్ మిల్టన్ నెవెస్ ఈ జంటను ఇంటర్వ్యూ చేశారు. వారిద్దిరు ఎలా కలుసుకున్నారు? అని సరదాగా సంభాషించారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మహిళ పేరు ఇమాన్యులా. ఆమె తన బాయ్‌ఫ్రెండ్ గురించి చెబుతూ.. తాను ఓ వీధిలో నడుస్తుంటే అతను తన ఫోన్ కొట్టేశాడని తెలిపింది.
"అతను ఉన్న వీధిలో నుంచి వెడుతున్నాను. ఆ సమయంలో ఓ దురదృష్టకర ఘటన జరిగింది. నా ఫోన్ ఎవరో కొట్టేశారు. నా ఫోన్ లో నేను నా వేరే ఫోన్ నెంబర్ ను సేవ్ చేశాను. కాసేపటికి ఆ నెం. నుంచి నాకు కాల్ వచ్చింది. నా ఫోన్ కొట్టేసింది తానేనని చెప్పాడు’ అని తెలిపింది.
సింగపూర్‌లో 20 ఏళ్లలో తొలిసారిగా మహిళకు మరణశిక్ష..
దీనిమీద అతను మాట్లాడుతూ.. "నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు. ఒంటరిగా ఉండడం ఎంతో బాధగా ఉండేది. నేను ఫోన్ కొట్టేశాక.. అందులో ఆమె ఫోటోను చూశాను. 'ఎంత అందంగా ఉందీ అనుకున్నాను. ఆమెను ప్రతిరోజూ చూడాలనుకున్నాను. ఆమె ఫోన్ కొట్టేసినందుకు ఫీల్ అయ్యాను..’ అని చెప్పుకొచ్చాడు.
ఆ తరువాత వారిద్దరూ కలుసుకున్నారు. మాట్లాడుకున్నారు. ఇద్దరి మధ్య స్నేహం చిగురించి.. ప్రేమగా మారింది. ఇమాన్యులా, ఆమె దొంగ ప్రియుడు రెండు సంవత్సరాలుగా కలిసి ఉన్నారు. అయితే అది ఎలా ప్రారంభమయిందో అనేదాన్ని బట్టి ఆమె కుటుంబం ఈ సంబంధాన్ని ఆమోదించిందా?లేదా? అనేది అస్పష్టంగా ఉంది.
నేరాలు చేసే సమయంలో కూడా నేరస్తులు ప్రేమలో పడిన ఘటనలు ఇది కొత్తేం కాదు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చాలా వెలుగు చూశాయి.
అమెరికన్ సీరియల్ కిల్లర్లు టెడ్ బండీ, రిచర్డ్ రామిరేజ్ లకు మహిళా అభిమానులు ఉన్నారు, చాలా మంది వారి విచారణకు కూడా హాజరవుతూ వారి దృష్టిని ఆకర్షించారు. 2018లో, మాజీ బ్లూమ్‌బెర్గ్ రిపోర్టర్ క్రిస్టీ స్మిత్ తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి, సెక్యూరిటీల మోసం కారణంగా అరెస్టయి, ఏడేళ్ల జైలు శిక్ష అనుభవించిన ఫార్మా బ్రో మార్టిన్ ష్క్రెలీతో ప్రేమలో పడింది. ఆ తర్వాత తన మాజీ భర్తకు విడాకులు ఇచ్చింది.