సింగపూర్‌లో 20 ఏళ్లలో తొలిసారిగా మహిళకు మరణశిక్ష..
30 గ్రాముల హెరాయిన్ అక్రమ రవాణాకు పాల్పడిన 36 ఏళ్ల మహిళను శుక్రవారం ఆగ్నేయాసియా నగర-రాష్ట్ర చాంగి జైలులో ఉరితీయబోతున్నట్లు స్థానిక హక్కుల సంస్థ ట్రాన్స్‌ఫార్మేటివ్ జస్టిస్ కలెక్టివ్ తెలిపింది.

సింగపూర్ : మాదకద్రవ్యాల అక్రమ రవాణా విషయంలో సింగపూర్ అత్యంత కఠిన శిక్షలు అమలు చేస్తుంది. ఈ క్రమంలోనే మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులు ఇద్దరు దోషులకు మరణశిక్ష విధించింది. ఆ శిక్షను ఈ వారం అమలు చేయనుంది. అయితే ఈ శిక్ష పడిన ఇద్దరిలో ఓ మహిళ కూడా ఉంది. ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారింది.
గత 20 ఏళ్లలో సింగపూర్లో ఓ మహిళను ఉరి తీయడం ఇదే మొదటిసారి.ఈ ఘటనకు సంబంధించిన వివరాలలోకి వెళితే… ఓ 56 ఏళ్ల వ్యక్తి 50 గ్రాముల హెరాయిన్ ను అక్రమంగా రవాణా చేశాడు. అతడిని ఈ కేసులో దోషిగా తేల్చి బుధవారం అంటే జూలై 26వ తేదీన చాంగీ జైలులో ఉరి తీయనున్నారు. ఈ మేరకు స్థానిక హక్కుల సంస్థ ట్రాన్స్ ఫార్మేటివ్ జస్టిస్ కలెక్టివ్ తెలిపింది.
ఆకలితో అలమటించిపోయి.. ఆహారం కోసం బిల్డింగ్ మీదినుంచి దూకిన 8యేళ్ల చిన్నారి...
ఇదే కేసులో శిక్ష పడిన మరో మహిళ సారిదేవి దామని(45)కి జూలై 28వ తేదీన ఉరిశిక్ష అమలు చేయనున్నారు. సారిదేవి 30 గ్రాముల హెరాయిన్ ను అక్రమంగా రవాణా చేసిన కేసులో 2018లో ఆమె ఉరిశిక్ష విధించారు. అప్పటినుంచి జైల్లోనే ఉన్న సారీ దేవికి ఇప్పుడు ఉరిశిక్ష అమలు చేయనున్నారు. దీనికి సంబంధించిన వివరాలను వారి కుటుంబాలకు ఇప్పటికే నోటీసులు పంపించినట్లుగా తెలిసింది.
ఈ ఉరిశిక్ష గనక అమలు అయితే 20 ఏళ్లలో ఓ మహిళను ఉరి తీయడం సింగపూర్లో ఇదే మొదటిసారి కానుంది. 2004లో డ్రగ్ ట్రాఫికింగ్ కేసులో ఓ 36 ఏళ్ల మహిళకు ఉరిశిక్ష వేశారని టీజేసీ కార్యకర్త కోకిల అన్నామలై తెలిపారు. అయితే, హక్కుల సంఘాలు వీరిద్దరికీ ఉరిశిక్షను నిలిపివేయాలని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాయి.
సింగపూర్ హత్యలు, కిడ్నాప్లు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా వంటి కేసుల్లో చాలా కఠినమైన శిక్షలను అమలు చేస్తుంది. 500 గ్రాముల కంటే ఎక్కువ గంజాయి, 15 గ్రాముల కంటే ఎక్కువ హెరాయిన్ ను అక్రమంగా రవాణా చేసిన కేసుల్లో దోషులకు మరణశిక్ష తప్పదు. కరోనా నేపథ్యంలో సింగపూర్ లో రెండేళ్ల పాటు మరణశిక్షలను అమలు చేయకుండా ఆపేశారు. ప్రస్తుతం మళ్ళీ వాటిని అమలు చేస్తున్నారు. ఇప్పటివరకు అలా 13మందిని ఉరి తీశారు. ఇద్దరు భారత సంతతి వ్యక్తులను కూడా ఆ మధ్య కాలంలో మరణశిక్ష అమలు చేశారు.