చీరలో కైట్ సర్ఫింగ్ చేస్తున్న మహిళ.. వైరల్ వీడియోపై నెటిజన్లు ఏమంటున్నారంటే...
ఓ మహిళ చీరలో కైట్ సర్ఫింగ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటికే ఈ వీడియోను 2.6 మిలియన్ల మంది చూశారు.
తమిళనాడు : భారతీయ సంప్రదాయ చీరకట్టుతో కూడా అద్భుతాలు చేయచ్చని నిరూపించిందో మహిళ. చీరలో కైట్ సర్ఫింగ్ చేసి.. అందర్నీ ఆకట్టుకుంటోంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె అసాధారణ నైపుణ్యం నెటిజన్లను వీపరీతంగా ఆకర్షిస్తోంది.
ఆమె పేరు కాత్య సైనీ, సర్టిఫైడ్ స్కూబా డైవింగ్ ఇన్ స్ట్రక్టర్, పాడి ఐకేఓ కైట్ ఇన్ స్ట్రక్టర్. ఆమె పసుపు, ఎరుపు రంగు చీరలో కైట్ సర్ఫింగ్ చేయడం ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటోంది.
హిజ్రాను కత్తితో బెదిరించి కిడ్నాప్, మత్తుమందిచ్చి లైంగిక దాడి.. ఇద్దరు అరెస్ట్..
ఈ వీడియో ఫుటేజ్ తమిళనాడులోని టుటికోరిన్‌లో తీశారు. దీన్ని కాత్య సైనీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. జూలై 10న పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పటికే 2.8 మిలియన్లకు వ్యూస్ సాధించింది. చాలామంది నెటిజన్స్ ఆమెను మెచ్చుకుంటూ కామెంట్ చేశారు.
"భారీ వర్షాల సమయంలో.. వీధులన్నీ నీటితో నిండిపోయినప్పుడు మా బాస్ ఇలా ఆపీస్ కి రావాలంటారు’.. అంటూ ఒకరు సరదాగా కామెంట్ చేయగా.. ‘ఇది క్రాస్ కల్చర్!! ఇలా చేయడం నాకు చాలా ఇష్టం. మీరొక అద్భుతం!!!!" అంటూ మరొకరు కామెంట్ చేశారు.
ఇంకొకరు.. ఇలాంటి ఫీట్ చేయడానికి ఎంత కఠిన శిక్షణ అవసరమో అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. వీడియోను మళ్లీ మళ్లీ చూశానని చెప్పుకొచ్చారు. అయితే ప్రశంసలతో పాటు.. విమర్శలూ వచ్చాయి.
భద్రతా కారణాల దృష్ట్యా వేరొక డ్రేపింగ్ స్టైల్‌ని ఉపయోగించాలని కొందరు సలహా ఇచ్చారు. ‘నేను కూడా ఇలా ప్రయత్నించాలనుకుంటున్నాను. అయితే, ఒక సూచన ఏంటంటే.. దీనికోసం నవరీ డ్రేప్ లేదా ధోతీ డ్రెప్ లాంటిదే ఏదైనా ఉపయోగించవచ్చు. స్పోర్ట్స్‌కు ఆ రకమైన డ్రేప్ మెరుగ్గా ఉంటుంది" అని కామెంట్ చేశారు.
ఇంకో నెటిజన్ తీవ్రంగా మండిపడ్డారు. ‘ఇది కరెక్ట్ కాదు. చాలా ప్రమాదకరమైనది. క్రీడల కోసం ప్రత్యేక దుస్తులు ఉన్నాయి, అవి ఫ్యాషన్ కాదు. చీర మధ్యలో చిక్కుకుపోతే జీవితాన్ని మార్చే ప్రమాదానికి దారితీసింది. ఈ ప్రమోషన్ గురించి ఎవరు ఆలోచించారో ఖచ్చితంగా తెలియదు. ఏదైనా ప్రచారం చేస్తున్నప్పుడు భద్రతను పరిగణనలోకి తీసుకోకపోవడం ఆశ్చర్యంగా ఉంది" అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.