కొడుకు తమ ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకుంటే మాట్లాడటం మానేసిన తల్లిదండ్రులు చూసి ఉంటారు. ఆస్తి రాసివ్వని పేరెంట్స్ ని చూసి ఉంటారు. అయితే... ఓ తల్లిదండ్రులు మాత్రం కన్న కొడుకు పట్ల అతి కిరాతకంగా ప్రవర్తించారు. తమ కడుపున పుట్టిన బిడ్డ అనే దయ లేకుండా సదరు యువకుడి పురుషాంగం కోసేశారు. ఈ దారుణ సంఘటన పశ్చిమ బెంగాల్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... పశ్చిమ బెంగాల్ రాష్ట్రం సైదాపూర్ ప్రాంతానికి చెందిన నూర్ ఆలం అనే యువకుడు వేరే కులానికి చెందిన యువతిని ప్రేమించాడు. వారి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. దీంతో... పెద్దల అనుమతి లేకుండానే యువకుడు తాను ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకున్నాడు.

యువతి కుటుంబీకులు వారి ప్రేమను ఆశీర్వదించడంతో... భార్యతో సహా అత్తారింటికి వెళ్లిపోయాడు. ఎంతైనా కన్నవారు కదా... పెళ్లి తర్వాత అంగీకరిస్తారులే అనే ధైర్యంతో... భార్యను తన పుట్టింటిలో వదిలేసి... పేరెంట్స్ కి నచ్చచెప్పేందుకు తన ఇంటికి వెళ్లాడు.

also read కండోమ్ వాడమని కోరినందుకు.. వేశ్యను కత్తితో పొడిచి..

అలా ఇంటికి వెళ్లినవాడు తిరిగి మళ్లీ రాకపోవడంతో యువతి కంగారుపడిపోయింది. పోన్ చేసినా కలవకపోవడంతో తన బంధువులందరికీ విషయం తెలియజేసింది. వారంతా కలిసి చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించగా... నిస్సహాయ స్థితిలో నూర్ ఆలం పడి ఉండటాన్ని గుర్తించారు.

తీరా చూస్తే... అతని పురుషాంగాన్ని కోసేశారు. కాళ్లపై కూడా కత్తిగాట్లు ఉన్నాయి. దీంతో భార్య స్థానికుల సాయంతో అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించింది. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పెళ్లి జరిగిన మరుసటి రోజూ అతడిపై ఇంతటి దారుణానికి పాల్పడిన వారెవరా? అని పోలీసులు విచారిస్తున్నారు. 

తమ అనుమతి లేకుండా పెళ్లి చేసుకున్నాడనే కోపంతో నూర్ అలం తల్లిదండ్రులే ఇలా చేసారని యువతి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కూడా ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు.