ఓ వ్యక్తి తన శృంగార వాంఛ తీర్చుకోవడానికి ఓ వేశ్య వద్దకు వెళ్లాడు. అతనితో శృంగారానికి అంగీకరించిన ఆమె...  కండోమ్ వాడాలని కోరింది. సురక్షిత శృంగారమే మంచిదని సూచించింది. ఆ ఒక్క కారణంతో సదరు వ్యక్తి ఆ వేశ్యను అతి దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... కర్ణాటక రాష్ట్రంలోని రాజాజీనగర్ ప్రాంతంలోని గాయత్రీ నగర్ కి  చెందిన ఓ మహిళకు వివాహమై ఓ కుమారుడు కూడా ఉన్నాడు. అయితే.. సదరు మహిళ కొంతకాలం క్రితం భర్తతో విడిపోయి తన కుమారుడితో కలిసి ఒంటరిగా జీవిస్తోంది. తన అందాలతో విఠులను ఆకర్షిస్తూ డబ్బులు సంపాదించుకుంటూ ఉంటుంది.

Also Read కుక్క పిల్లల కోసం ప్రాణాలకు తెగించి.. పాముల బావిలోకి దిగి...

ఎలక్ట్రానిక్స్ సిటీ సమీపంలోని వీరసాండ్రా ప్రాంతానికి చెందిన ముకుంద్(48) అనే వ్యక్తి ప్రైవేటు కంపెనీలకు వాచ్ మెన్ గా వ్యవహరిస్తున్నాడు. అతను జనవరి 11వ తేదీన అనుకోకుండా సదరు మహిళను  ఓ ప్రాంతంలో కలుసుకున్నాడు. అతనిని సదరు మహిళ తన అందాలతో ఆకర్షించింది. అతని శృంగార కోరిక తీరుస్తానని మాటిచ్చింది. ఇద్దరూ కలిసి బేరం ఆడుకున్నారు. ఆమె కోరిక తీర్చడానికి రూ.2,500 కావాలని డిమాండ్ చేసింది. చివరకు బేరం రూ.1,500లకు కుదిరింది.

అడ్వాన్స్ గా ముకుంద్ సదరు మహిళకు రూ.500 ఇచ్చాడు.  అక్కడి నుంచి ఆ ఇద్దరూ ఆటోలో సదరు మహిళ ఇంటికి చేరుకున్నారు. అక్కడికి వెళ్లాక అతను మిగిలిన రూ.వెయ్యి కూడా ఆమెకు ఇచ్చాడు. అయితే శృంగారంలో పాల్గొనడానికి ముందు కండోమ్ ధరించాలని ఆమె ముకుంద్ ని కోరింది. అందుకు అతను నిరాకరించాడు. సురక్షిత శృంగారమే ముఖ్యమని.. కండోమ్ వేసుకోవాల్సిందేనని ఆమె పట్టుపట్టింది.

దీంతో తన డబ్బులు తనకు ఇచ్చేస్తే తాను వెళ్లిపోతానని... ఆమెను అడిగాడు. దీంతో ఆమె అతనిని బెదిరించింది. డబ్బులు కావాలని అడిగినా, కండోమ్ లేకుండా శృంగారంలో పాల్గొనా అరిచి గొడవ చేస్తానని బెదిరించింది. దీంతో అతను తన బ్యాగ్ లోని కత్తి బయటకు తీసి ఆమె మెడ దగ్గరపెట్టి ఆమెను బెదిరించాడు. డబ్బు ఇవ్వకుంటే చంపేస్తానని అన్నాడు.

ఆమె బెదరకపోవడంతో కత్తితో పొట్టలో పొడిచాడు. దీంతో ఆమె సహాయం కోసం గట్టిగా అరవడం మొదలుపెట్టింది. అవి విని ఎవరైనా వస్తారేమో అనే కంగారులో ముకుంద్ మహిళ గొంతు కోసి అక్కడి నుంచి పరారయ్యాడు. వెళ్లే టప్పుడు సదరు మహిళ మెడలోని కాకి బంగారం చైన్, ఆమె ఫోన్ తీసుకొని పరారయ్యాడు. మధ్యాహ్నం 3గంటల 45 నిమిషాల సమయంలో సదరు మహిళ కుమారుడు స్కూల్ నుంచి ఇంటికి చేరుకున్నాడు. కాగా... అతను ఇంటికి వచ్చే సరికి తల్లి రక్తపు మడుగులో పడి చనిపోయి ఉండటాన్ని గుర్తించి అందరికీ సమాచారం ఇచ్చాడు.

బాలుడి ఫిర్యాదు తో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని కనుగొన్నారు. వెంటనే అతనిని పట్టుకోని అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.