వైరల్ వీడియో : వజ్రాల కోసం రోడ్డుమీద వెతుకులాట... చివరికి ఏం జరిగిందంటే..

నడిరోడ్డుపై వజ్రాలు పోగొట్టుకున్నాడో వ్యాపారి. ఆ విషయం వెలుగు చూడడంతో జనాలు రోడ్డు మీదికి పోటెత్తారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. 

Viral video : Searching for diamonds on the road in Gujarat - bsb

గుజరాత్‌ : గుజరాత్ లోని సూరత్ లో వజ్రాలు కలకలం రేపాయి. నడిరోడ్డులో ఓ వ్యాపారికి చెందిన వజ్రాలు పడిపోయాయన్న వార్తలు గుప్పుమన్నాయి. దీంతో ప్రజలు రోడ్డు మీదికి ఎగబడ్డారు. వజ్రాలను దక్కించుకోవడానికి రోడ్డుమీదికి పరుగులు పెట్టారు. వివరాల్లోకి వెడితే...

వజ్రాల అమ్మకం, కొనుగోలు చేసే మినీ బజార్, వరచ్చా ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి అనుకోకుండా వజ్రాల ప్యాకెట్‌ను రోడ్డు మీద పోగొట్టుకున్నాడన్న పుకార్లు వ్యాపించాయి. దీంతో గుజరాత్‌, సూరత్‌లోని రోడ్డుపైకి జనాలు పోటెత్తారు. వజ్రాల కోసం వెతుకుతున్న వీడియోలు ఇంటర్నెట్‌లో హల్ చల్ చేశాయి. 

బీజేపీ ఎమ్మెల్యే అధికారిక నివాసంలో యువకుడు ఆత్మహత్య...

అహ్మదాబాద్ మిర్రర్ కథనం ప్రకారం, ఓ వ్యాపారికి చెందిన కోట్ల విలువైన వజ్రాలు ప్రమాదవశాత్తు రోడ్డుపై పడ్డాయని ఒక మెసేజ్ ప్రచారంలోకి వచ్చింది. తప్పిపోయిన వజ్రాల కోసం వెతుకుతున్నవారి ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. కొందరు వ్యక్తులు మార్కెట్ రోడ్డులోని దుమ్మును కూడా సేకరించి వజ్రాల కోసం వెతికారని మీడియా సంస్థ పేర్కొంది. కొందరికి కొన్ని వజ్రాలు కూడా దొరికాయి. కానీ, అవి అమెరికన్ వజ్రాలు.

వజ్రాల కోసం వీధిలో వెతుకుతున్న వారిలో ఒకరైన అరవింద్ పన్సేరియా మాట్లాడుతూ, ఒక వ్యక్తికి వజ్రం దొరికిందని, అయితే అది నకిలీ వజ్రం అని తేలిందని తెలిపారు. అది ఇమిటేట్ ఆభరణాల తయారీలో లేదా చీరల మీద వర్క్ చేయడానికి ఉపయోగించే ఫేక్ వజ్రం అని తేలింది. "ప్రజల దృష్టిని మళ్లించడానికి చేసిన ప్రాంక్ అయి ఉండొచ్చు’’అని జనాలు అభిప్రాయపడ్డారు. ఈ ఘటన సెప్టెంబర్ 24న జరిగింది.

ఇదిలా ఉండగా, నాగ్‌పూర్ లో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. కారు హెడ్‌లైట్‌ విషయంలో జరిగిన వాదనలో స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (ఎస్‌ఆర్‌పిఎఫ్) జవాన్ ఓ 54 ఏళ్ల వ్యక్తిని చెంపదెబ్బ కొట్టాడు. దీంతో అతను మరణించాడని ఆదివారం ఒక అధికారి తెలిపారు. నిందితుడైన జవాన్ ను నిఖిల్‌ గుప్తా (30)గా గుర్తించారు. అతను తన సోదరిని చూసేందుకు వథోడా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మాతా మందిర్‌ ప్రాంతానికి వెళ్లే క్రమంలో గురువారం రాత్రి ఘటనా స్థలానికి చేరుకున్నాడు.

గుప్తా తన కారును పార్క్ చేస్తున్నప్పుడు, కారు హెడ్‌లైట్ బీమ్ అదే ప్రాంతంలో నివసించే బాధితుడు మురళీధర్ రామ్‌రాజీ నెవేర్ ముఖంపై నేరుగా పడుతుందని అధికారి తెలిపారు. దీంతో బాధితుడు మురళీధర్ మర్యాదపూర్వకంగా నిందుతుడైన నిఖిల్‌ గుప్తాకు కారు హెడ్ లైట్ తగ్గించమని చెప్పాడు. కానీ, ఎస్సార్పీఎఫ్ జవాన్ కోపానికి వచ్చాడు. నాకే చెబుతావా అని విరుచుకుపడ్డాడు. దీంతో ఇది ఇద్దరి మధ్య వాగ్వాదానికి దారితీసింది.

వాదనతో ఆగ్రహానికి వచ్చిన గుప్తా.. నెవర్ ని గట్టిగా కొట్టడంతో నెవేర్ నేలమీద కుప్పకూలిపోయాడు. అతడిని ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రికి తరలించగా, శనివారం మరణించినట్లు అధికారి తెలిపారు. పోలీసులు గుప్తాపై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 304 కింద కేసు నమోదు చేసినట్లు అధికారి తెలిపారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios