అడ్డొచ్చిన బాలుడి పైనుంచి వెళ్లిన బ్రిటన్ రాయల్ గార్డ్.. వీడియో వైరల్..
ఆ గార్డు మాత్రం ఆగకుండా... అతని మీదినుంచి అలాగే వెళ్లిపోయాడు. అయితే, కిందపడిన బాలుడు వెంటనే లేవడంతో అక్కడున్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో.. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ వీడియోకు ట్విటర్ లో 20 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.
లండన్ : Britainలోని Tower of London ప్రాంతం.. సందర్శకులతో సందడిగా ఉంది. ఆ సమయంలో ఇద్దరు Royal Guardలు గంభీరంగా కవాతు చేసుకుంటూ వెల్తున్నారు. కానీ, అంతలోనే ఊహించని పరిణామం. అనుకోకుండా ఓ బాలుడు కవాతు చేస్తున్న ఓ గార్డుకు అడ్డుగా వచ్చాడు. వెంటనే అతని కాళ్లకింద పడిపోయాడు.
కానీ, ఆ గార్డు మాత్రం ఆగకుండా... అతని మీదినుంచి అలాగే వెళ్లిపోయాడు. అయితే, కిందపడిన బాలుడు వెంటనే లేవడంతో అక్కడున్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో.. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ వీడియోకు ట్విటర్ లో 20 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.
ఈ ఘటన మీద స్థానిక రక్షణ మంత్రిత్వ శాఖ స్పందించింది. దీని గురించి తమకు తెలుసని ఒక ప్రకటనలో తెలిపింది. గార్డులు వస్తున్నారని ప్రజలు ముందస్తుగానే హెచ్చరించామని, కానీ, దురదృష్టవశాత్తు ఆ బాలుడు సైనికుడికి అతి సమీపంలో వెళ్లినట్టు పేర్కొంది. అయినప్పటికీ.. ఆ సైనికుడు అతన్ని దాటే అడుగేసినట్లు, అనంతరం ఆ పిల్లాడినీ పరామర్శించినట్లు తెలిపింది.
‘క్వీన్స్ గార్డ్’ బృందం.. బ్రిటన్ లోని రాజరిక నివాసాలకు కాపలా బాధ్యతలు చూస్తుంటుంది. ఇదిలా ఉండగా ఈ ఘటన మీద నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. ఆ సమయంలో పిల్లాడి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారని కొందరు ప్రశ్నించగా.. మరికొందరు ఈ కవాతు సంప్రదాయాన్ని విమర్శించారు.
క్వీన్ ఎలిజబెత్ హత్యకు యత్నించిన 19యేళ్ల బాలుడు.. దానికి ప్రతీకారంగానే..
ఇదిలా ఉండగా, నాలుగు రోజుల క్రితం బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ ను హత్య చేయడానికి ప్రయత్నించాడో బాలుడు. ఈ ఘటన కలకలం రేపింది. అయితే, బ్రిటన్ రాణి Queen Elizabeth (95)ను murder attempt చేయడానికి ప్రయత్నించిన 19 ఏళ్ల యువకుడిని స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తాను indian sikhనని, తన పేరు జశ్వంత్ సింగ్ ఛాయిల్ అని అతను చెప్పుకొచ్చాడు. 1919 లో జరిగిన Jallianwala Bagh మారణకాండకు ప్రతీకారంగా రాణి హత్య చేయదలచినట్టు పేర్కొన్నాడు.
ఈ మేరకు స్నాప్ చాట్ లో వీడియో పెట్టాడు. దీనిని చిత్రీకరించిన సమయంలో పూర్తిగా ముసుగు ధరించి ఉన్నాడు అతని మానసిక స్థితి పై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేశారు. అతడిని ప్రస్తుతం మానసిక వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడానికి విండ్సర్ క్యాజిల్ రాజ ప్రసాదానికి క్వీన్ ఎలిజబెత్ వెళ్లారు. శనివారం ఆ యువకుడు అక్కడికి వెళ్లాడు.
చేతిలో విల్లు లాంటి క్రాస్ బౌ ఆయుధం కూడా ఉంది. రాణి నివాసం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు 24 నిమిషాల ముందు తీసుకున్న వీడియోను ఆ యువకుడు స్నాప్ చాట్ లో పెట్టాడు. ‘ నన్ను క్షమించండి. నేను చేసిన దానికి, చేయబోయే దానికి క్షమించండి. రాజ కుటుంబానికి చెందిన క్వీన్ ఎలిజబెత్ ను హత్య చేస్తాను. 1919 లో జరిగిన జలియన్వాలా బాగ్ మారణకాండకు ఇది ప్రతీకారం అని పేర్కొన్నాడు.