వైరల్ వీడియో : "ఆకాశంలో బాణసంచా".. విమానంలోనుంచి చూస్తే పిడుగు ఇలా కనిపిస్తుందా?
పిడుగు ఎలా కనిపిస్తుందో తెలుసా? అదీ ఆకాశం నుంచి అయితే...విమానం నుంచి పిడుగును వీడియో తీసి ఇన్ స్టాలో షేర్ చేశాడో వ్యక్తి.
వర్షాన్ని ఎలా వర్ణిస్తారు.. జలతారు వాన.. కుండపోత వాన, చిరుజల్లు..ఇలా అనేక రకాలుగా వివరిస్తుంటారు. వర్షబీభత్సాన్ని వర్ణించాలంటే.. ఉరుములు,మెరుపులు, పిడుగులతో కూడిన వర్షం అంటూ చెబుతాం. మరి ఈ పిడుగు ఎలా ఉంటుంది. మెరుపు తీగలా ఉంటుందా? కాంతిపుంజంలా ఉంటుందా? ఆకాశంలో నుంచి చూస్తే ఎలా కనిపిస్తుంది? దీనికి సంబంధించి విమానంలోనుంచి తీసిన ఓ వీడియో వైరల్ అవుతోంది.
"పిడుగులతో కూడిన వర్షం" అనే పదం సాధారణంగా వాడుతుంటాం. ఉరుము అనగానే చీకటి మేఘాలు, మెరుపులు, పిడుగులు, శక్తివంతమైన గాలులు, వర్షంలాంటి వాతావరణంలో సంభవించే నాటకీయ వాతావరణ మార్పులు మదిలో మెదులుతాయి. ఉదాహరణకు ఆకాశం చీకటిగా మారడం, గాలిలో మార్పు.లు చోటు చేసుకోవడం..లాంటివి.
ఉదయనిధి స్టాలిన్‌పై కస్తూరీ ఫైర్.. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ట్వీట్ వైరల్
మామూలుగా మనం భూమి మీద ఉండి.. ఆకాశం నుంచి కురిసే వచ్చే ఉరుములతో కూడిన తుఫాను చూడటం అనేది సుపరిచితమైన అనుభవం, అయితే ఇటీవల, ఒక సోషల్ మీడియా వినియోగదారుడు తుఫానును విమానం నుండి చిత్రీకరించాడు. భూమికి 35,000 అడుగుల ఎత్తు నుండి పిడుగులు ఎలా ఉంటాయో తీసిన ఫుటేజీని సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
పరమ్ అనే సోషల్ మీడియా యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో ఆకట్టుకునే విధంగా ఉంది. వీడియోకు, "35,000 అడుగుల ఎత్తులో ఉరుము, పిడుగులతో కూడిన వర్షం ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? అయితే ఈ వీడియో చూడండి" అంటూ కాప్షన్ ఇచ్చారు.
పిడుగులతో కూడిన తుఫాను తీవ్రతకు చాలా మంది నెటిజన్లను విస్మయానికి గురిచేసింది. మొత్తం ఆకాశాన్ని ప్రకాశింపజేసే తీవ్రమైన మెరుపులతో వీడియో ప్రారంభమవుతుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో భాగస్వామ్యం చేసినప్పటి నుండి, వీడియో వైరల్‌గా మారింది, 57,000 కంటే ఎక్కువ లైక్‌లు వచ్చాయి. చాలా మంది ఈ వీడియోపై తమ అభిప్రాయాలను కామెంట్ చేశారు.
"మేఘాలలో నివసించే వ్యక్తులు ఇంట్లో పార్టీ చేసుకుంటున్నారు" అని ఒకరు కామెంట్ చేయగా... ‘మీ విమానంలో, మీరు దీన్ని చూస్తారు" అని మరొకరు అన్నారు. ఇంకొకరు.."ఎవరో ఆ మేఘాలలో ఫ్లాష్‌లైట్‌తో తిరుగుతున్నారు" అని వ్యాఖ్యానించారు.