Asianet News TeluguAsianet News Telugu

ఉదయనిధి స్టాలిన్‌పై కస్తూరీ ఫైర్.. మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ట్వీట్ వైరల్

Chennai: ఉదయనిధి ప్రసంగాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది. ఉదయనిధి ప్రసంగంపై కేంద్ర మంత్రి అమిత్ షా సైతం అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఉదయనిధి స్టాలిన్‌పై ఢిల్లీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా నమోదైంది. అయితే, ఆయన ప్రసంగంపై వ్యతిరేకత వచ్చినా ఉదయనిధి ధీటుగా సమాధానం ఇచ్చారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా పోరాటానికి సిద్ధమని చెప్పారు. 
 

actress Kasthuri Shankar fires at Udhayanidhi Stalin Mega Power Star Ram Charan's tweet goes viral RMA
Author
First Published Sep 5, 2023, 12:02 PM IST

Sanatan Dharma-Udhayanidhi Stalin: చెన్నైలో జరిగిన ఒక కార్య‌క్ర‌మంలో డీఎంకే నాయ‌కుడు, రాష్ట్ర మంత్రి మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్య‌లు జాతీయ స్థాయిలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. స‌నాత‌న ధ‌ర్మంపై ఆయ‌న మాట్లాడుతూ దోమలు, డెంగ్యూ, మలేరియా, కరోనా వంటి సనాతనాన్ని నిర్మూలించాలంటూ వ్యాఖ్యానించారు. దీంతో రాజ‌కీయ దుమారం మొద‌లైంది. కాషాయ పార్టీ మంత్రి వ్యాఖ్య‌ల‌పై తీవ్రంగా స్పందిస్తోంది. ఈ క్ర‌మంలోనే  న‌టి క‌స్తూరీ సైతం ఉద‌యనిధి వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తూ ప‌లు ప్ర‌శ్న‌లు సంధించారు.  

"మీ కుటుంబంలో డెంగ్యూ, మలేరియా వ్యాప్తి చెందుతాయి. మీరు వాటితో ఏమి చేయాలనుకుంటున్నారు? సనాతనపై అంత ద్వేషం ఉన్నవారికి, హిందూ దేవాలయాల ఆస్తులతో ప‌నేంటి, వాటిని మాత్రమే అడుగుతారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అలాగే, ప్ర‌తిప‌క్షాల కూట‌మి ఇండియా నుంచి డీఎంకే వైదొల‌గాల‌ని డిమాండ్  చేస్తూ ఈ కూట‌మిలో అనేక మంది స‌నాత‌న వాదులు ఉన్నార‌ని పేర్కొన్నారు.

ఉద‌య‌నిధి స్టాలిన్ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో మెగాప‌వ‌ర్ స్టార్ స‌నాత‌న ధ‌ర్మంపై చేసిన ఒక పోస్టు ప్ర‌స్తుతం వైర‌ల్ గా మారింది. ఆ పాత ట్వీట్ లో తన తల్లి సురేఖ ఇంట్లో తులసి మొక్కకు పూజ చేస్తున్న ఫొటోను పంచుకున్నచరణ్.. "మన సనాతన ధర్మాన్ని రక్షించుకోవడం మనందరి భాధ్యత" అని పేర్కొన్నారు. 2020 నాటి ఈ పోస్టు ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది. చరణ్ ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ మెగా కుటుంబంపై పై ప్రశంసలు కురిపిస్తున్నారు. 

ఇదిలావుండ‌గా, ఉదయనిధి ప్రసంగాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది. ఉదయనిధి ప్రసంగంపై కేంద్ర మంత్రి అమిత్ షా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఉదయనిధి స్టాలిన్‌పై ఢిల్లీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా నమోదైంది. అయితే, ఆయన ప్రసంగంపై వ్యతిరేకత వచ్చినా ఉదయనిధి ధీటుగా సమాధానం ఇచ్చారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా పోరాటానికి సిద్ధమని చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios