వైరల్ : పెళ్లి రిసెప్షన్ కు అతిధిగా ఎలుగుబంటి.. స్వీట్లు, డెజర్ట్స్ ఖాళీ చేస్తూ...
కొలరాడోలో ఓ జంట వివాహానికి అనుకోని అతిథి వచ్చింది. కేకులు, స్వీట్లు తింటూ వారి వివాహ విందును ఆస్వాదించింది. కానీ మిగతా అతిథులు మాత్రం అది అక్కడినుంచి పోయేవరకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు.
కొలరాడో : ఓ జంట ఎంతో సంతోషంగా వివాహాం చేసుకుంటున్నారు. ఇంతలో అక్కడికి ఓ అనుకోని అతిథి వచ్చింది. దాన్ని చూసి వచ్చిన గెస్ట్ లంతా హాహాకారాలు చేస్తూ పారిపోయారు. ఆ అతిథి మనుషి కాదు.. ఎలుగుబంటి.. ఈ కొలరాడోకు చెందిన ఓ జంటబ్రాండన్ మార్టినెజ్, కైలిన్ మెక్‌రోసీ-మార్టినెజ్ ఇటీవల బౌల్డర్ కౌంటీలో వివాహం చేసుకున్నారు.
వారి జీవితంలో ప్రత్యేకమైన ఆ రోజు వర్షం పడింది. ఆ వర్షానికే వచ్చిందో.. లేక హడావుడికే చేరిందో తెలియదు కానీ ఓ ఎలుగుబంటి వివాహవేదికకు వచ్చింది. ఆ ఎలుగుబంటి అక్కడున్న అన్ని తీపి వంటకాలను తింటూ, వారి డెజర్ట్ టేబుల్‌ను పూర్తిగా ఖాళీ చేసింది.
పొలంలో పని చేస్తుండగా ఆకాశం నుంచి మహిళపై పడ్డ పాము.. పలుమార్లు కాటేయగానే.. డేగ కూడా వచ్చి దాడి..
కైలిన్ ఫేస్ బుక్ లో ఆ ఫొటోలను షేర్ చేశాడు. "ఒక ఎలుగుబంటి మా డెజర్ట్ టేబుల్ ను ఖాళీ చేసింది" అని క్యాప్షన్ ఇచ్చాడు. దీనికి అనేకమంది కామెంట్స్ చేశారు. ఎలుగుబంటి కోసం సెపరేట్ టేబుల్ ఏర్పాటు చేయాల్సింది అంటూ హాస్యం చేశారు. ఈ జంట స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. విందుకోసం వెళ్లేసరికి ఇలా ఎలుగుబంటి ఖాళీ చేస్తూ కనిపించడం షాక్ అయ్యాం... అన్నారు.
దీనికంటే ముందు ఎలుగుబంటి ఎవరిమీదైనా దాడి చేస్తుందేమోనని భయపడ్డాం అన్నారు. కానీ అదృష్టవశాత్తు ఎవరికీ హాని జరగలేదు అని చెప్పుకొచ్చారు. దురదృష్టవశాత్తూ ఈ జంటకు, తమకిష్టమైన విందును కోల్పోయారు.సోషల్ మీడియాలో ఇది బాగా వైరల్ అయ్యింది. పోస్ట్‌కు అనేక లైక్‌లు, కామెంట్‌లు వచ్చాయి.