Asianet News TeluguAsianet News Telugu

పొలంలో పని చేస్తుండగా ఆకాశం నుంచి మహిళపై పడ్డ పాము.. పలుమార్లు కాటేయగానే.. డేగ కూడా వచ్చి దాడి..

మహిళా రైతు పొలంలో పని చేస్తుండగా ఓ పాము ఆమెపై పడింది. వెంటనే ఆమెను కాటేసింది. కాసేపయ్యాక ఓ డేగ కూడా వచ్చింది. ఆమెపై దాడి చేసింది. దీంతో ఆ రైతు చేతికి తీవ్రగాయాలు అయ్యాయి. 

A snake fell from the sky on a woman while she was working in the field..ISR
Author
First Published Aug 10, 2023, 1:07 PM IST

ఓ మహిళ తన పొలంలో పని చేసుకుంటోంది. ఆ సమయంలో ఆకాశంలో ఓ డేగ పామును తన కాళ్లతో పట్టుకొని వెళ్తోంది. అయితే సరిగ్గా ఆ పొలం దగ్గరకు వచ్చే సరిగా ఆ పాము డేగ కాళ్ల నుంచి జారిపోయింది. అది నేరుగా ఆ పొలంలో పని చేస్తున్న మహిళపై పడింది. అప్పటికే కోపంతో ఉన్న పాము ఆ మహిళను కాటేసింది. కొద్ది క్షణాల్లోనే డేగ వచ్చి కూడా ఆ మహిళపై దాడి చేయడం ప్రారంభించింది. తరువాత ఏం జరిగిందంటే ? 

అమెరికాలోని టెక్సాస్ కు చెందిన ఓ మహిళా వృద్ధ రైతుకు ఓ విచిత్ర అనుభవం ఎదురైంది. ఆమె రెండు సంవత్సరాల కిందట ఓ అనుకోని ప్రమాదానికి గురై ప్రాణాలతో బయటపడ్డారు. చాలా అరుదుగా జరిగే ఇలాంటి ఘటనను ఆమె ‘ది న్యూయార్క్ టైమ్స్’కు వివరించారు. ఆ రోజు జరిగిన ఘటన తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని ఆమె చెప్పారు. 

టెక్సాలోని సిల్స్బీకి చెందిన 65 ఏళ్ల  పెగ్గీ జోన్స్ అనే మహిళ తన నివాసానికి ఆనుకొని ఉన్న ఆరెకరాల పొలంలో భర్తతో కలిసి వ్యవసాయం చేస్తుంటుంది. రెండేళ్ల కిందట ఒక రోజు పొలంలో పని చేస్తోంది. ఆ సమయంలో ఆమె భర్త ఇంట్లో ఉన్నారు. ఆమె పొలం పనుల్లో నిమగ్నమైన సమయంలో ఆకాశంలో ఓ డేగ ఎగురుతోంది. దాని కాళ్లలో ఓ పామును పట్టుకొని వెళ్తోంది. డేగ నుంచి తప్పించుకోవడానికి ఆ విష సర్పం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో సరిగ్గా పొలం దగ్గరకు రాగానే పాము డేగ కాళ్ల నుంచి జారిపోయి పెగ్గీ జోన్స్ పై పడింది. 

ఈ అనుకోని పరిణామానికి ఆమె ఒక్క సారిగా ఉలిక్కిపడింది. ఏం జరిగిందో అర్థం చేసుకునేలోపే.. ఆగ్రహంతో ఉన్న ఆ పాము పెగ్గీ జోన్స్ చేతిపై కాటేడయం ప్రారంభించింది. దీంతో ఆమె తీవ్రంగా అరిచింది. అయితే కొన్ని క్షణాల్లోనే ఆ డేగ కూడా మహిళపై వైపు దూసుకొచ్చింది. తన ఆహారం ఎక్కడ చేజారిపోతుందో అనే ఉద్దేశంతో ఆ మహిళ చేతిపై దాడి చేస్తూ, పామును లాక్కునేందుకు ప్రయత్నించింది. ఆమెకు ఏం జరుగుతుందో అర్థం కాక కేకలు వేస్తూనే ఉంది. 

ఆమె అరుపులు వినిపించడంతో భర్త పరిగెత్తకుంటూ వచ్చాడు. ఆమె చేతికి అయిన గాయాలు, రక్తాన్ని చూశాడు. భార్య పాము కాటుకు గురైందని అర్థం చేసుకోని, వెంటనే ఇంట్లోకి తీసుకెళ్లి, అక్కడి నుంచి ట్రక్కులో ఓ హాస్పిటల్ కు తీసుకెళ్లాడు. అక్కడి డాక్టర్లు ఆమెకు చికిత్స అందించారు. కొంత కాలం తరువాత ఆమె కోలుకుంది. తరువాత తన పనుల్లో నిమగ్నం అయ్యింది. కానీ ఇప్పుడు పొలంలోకి వెళ్లినా ఆ నాడు జరిగిన ఘటనే గుర్తుకొస్తుందని ఆమె చెప్పారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios