Asianet News TeluguAsianet News Telugu

మహిళ మీద దాడి చేసిన తాబేలు.. నీరివ్వబోతే దాడి..

చాలా ప్రశాంతంగా కనిపించే తాబేలు మహిళ మీద దాడి చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. 

Turtle Attacks Woman As She Gives Him Water, viral video - bsb
Author
First Published May 12, 2023, 3:58 PM IST

కొన్నిసార్లు కొన్ని జంతువుల ప్రవర్తన విచిత్రంగా ఉంటుంది. జంతువుల చేష్టలు సరదాగా ఉంటాయి. మనసుకు ఉల్లాసాన్ని కలిగిస్తాయి. అయితే, ఒక్కోసారి అవి చేసే భయంకరమైన అనుభవాలను మనల్ని జీవితాంతం భయపెడుతుంది. ఒక మహిళ  తాబేలుకు నీరు ఇస్తుండగా.. ఆమె మీద దాడి చేయడంతో అలాంటి సంఘటన ఒకటి ఎదురైంది. 

హృదయాన్ని కదిలించే ఈ సంఘటనకు సంబంధించిన క్లిప్ ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. అదిప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తుంది. ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఈ క్లిప్‌లో, తాబేలుకు ఓ మహిళ వాటర్ బాటిల్ తో నీరు అందిస్తుంది. ఆ నీటిని తాగుతున్నట్లు కనిపిస్తుంది. జంతువు చాలా దాహంతో ఉన్నట్లు కనిపిస్తోంది. కాసేపు, అది నీరు ప్రశాంతంగా.. త్రాగుతూనే ఉంది. కాసేపటికి అది ఆమె మీదికి దాడి చేసింది. అయతే,  స్త్రీ, తాబేలును కంచె వేరు చేస్తుంది. 

వ్యూస్ కోసం యూ ట్యూబర్ అరాచకం.. ఏకంగా విమానాన్ని కూల్చేసి.. వీడియో తీసి...

చిన్న క్లిప్‌లో, "తాబేలు చాలా దాహంతో ఉంది" అని చెప్పుకొచ్చింది. కొన్ని సెకన్ల తర్వాత, ఆమె నీటిని అందించడానికి ట్రై చేస్తుంది. నీటిని తాబేలు ముఖంపై పోస్తుంది. ఆమె ఇలా చేయగానే తాబేలు నోరు తెరిచి ఆ మహిళపై దాడికి దిగింది. అదృష్టవశాత్తూ, కంచె కారణంగా ఆమె గాయపడలేదు. చాలా ప్రశాంతంగా కనిపించే ఒక చిన్న జంతువు ఇలా దాడి చేస్తుందని చాలా మందిని నమ్మలేని పరిస్థితిలో ఈ క్లిప్ ఉంది.

షేర్ చేయబడినప్పటి నుండి, పోస్ట్ నాలుగు మిలియన్లకు పైగా వ్యూస్ ను, 39,000 లైక్‌లు వచ్చాయి. "తాబేలు అస్సలు కృతజ్ఞత లేకుండా ఉంది’’ అని ఒకరు కామెంట్ చెప్పారు"

 

Follow Us:
Download App:
  • android
  • ios